ముగిసిన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2022-05-19T06:18:29+05:30 IST

ముగిసిన బ్రహ్మోత్సవాలు

ముగిసిన బ్రహ్మోత్సవాలు
చూర్ణోత్సవం సందర్భంగా స్వామిని కీర్తిస్తూ వడ్లు దంచుతున్న అర్చకులు

శాస్త్రోక్తంగా చూర్ణోత్సవం, వసంతోత్సవాలు

ద్వారకాతిరుమల, మే 18: చిన్న తిరు మలేశుని క్షేత్రంలో ఈనెల 11న ప్రారం భమైన స్వామివారి దివ్యకల్యాణ మహో త్స వాలు బుధవారంతో  ముగిశాయి.  రాజా ధి రాజ వాహనంపై రాజసంగా ..ఉభయ దే వేరులతో ఆశీనులైన చిన్నతిరుమలేశుడు భక్తు లపై వసంతాలు కురిపించారు. శ్రీవారి వైశా ఖమాస బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి వరకూ జరిగిన విశేష కార్యక్రమాలతో ముగి శాయి. ఉదయం పాదుకా మండపం వద్ద నున్న పాత కల్యాణమండప ఆవరణలో నిర్వ హించిన చూర్ణోత్సవం, వసంతోత్సవం భక్తు లకు కన్నుల పండువయ్యాయి. కల్యాణ మూర్తులను రాజాధిరాజ వాహనంలో ఉంచి అర్చకులు అలంకరణలు జరిపారు. ఆ తరు వాత గ్రామంలో ఊరేగించారు. అనంతరం కల్యాణ మండప ఆవరణలో ఉంచి హార తులు సమర్పించారు. ఆ తరువాత చూర్ణో త్సవ, వసంతోత్సవాలు ఘనంగా జరిపారు.  రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు. శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు వేడుకగా జరిపారు. శీదేవి, భూ దేవి సమేత శ్రీనివాసుని ఆలయ కల్యాణ మండపంలో ఉంచి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం స్వామికి వసంతాలను సమర్పించారు. అర్చకులు, మహిళలు శ్రీ వారిని కీర్తిస్తూ వడ్లను దంచారు. అనంతరం మరోసారి తిరు వీధులకు వెళ్లి భక్తులపై వేడుకగా వసంతాలను చల్లారు.  ఆలయ ప్రాంగణంలో ఉభయదేవేరులతో శ్రీనివాస మూర్తికి 12 ప్రదక్షిణలు, 12 సేవాకాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదన రాత్రి కన్నుల పండువగా జరిగింది. ఒక్కో ప్రద క్షిణకు ఒక్కో సేవాకాలాన్ని ఒక్కో పిండి వం టను ఆరగింపు చేశారు. అనంతరం పవళింపుసేవా మందిరాన్ని పుష్పమాలికలతో అలంకరించారు. శ్రీపుష్పయాగోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.




Updated Date - 2022-05-19T06:18:29+05:30 IST