IPL మీడియా హక్కుల విలువ రూ.48,390 కోట్లు.. ఈ-వేలం పూర్తి.. BCCI సెక్రటరీ Jay Shah వెల్లడి..

ABN , First Publish Date - 2022-06-15T01:59:25+05:30 IST

ఐపీఎల్(IPL) మీడియా హక్కుల ఈ-వేలం మంగళవారం ముగిసింది. లీగ్ 5 సీజన్ల(2023- 2027 కాలంలో) హక్కులు గతం కంటే 3 రెట్లు అధికంగా ఏకంగా రూ.48,390 కోట్ల మొత్తానికి అమ్ముడుపోయాయి.

IPL మీడియా హక్కుల విలువ రూ.48,390 కోట్లు.. ఈ-వేలం పూర్తి.. BCCI సెక్రటరీ Jay Shah వెల్లడి..

ముంబై : ఐపీఎల్(IPL) మీడియా హక్కుల ఈ-వేలం మంగళవారం ముగిసింది. లీగ్ 5 సీజన్ల(2023- 2027 కాలంలో) హక్కులు గతం కంటే 3 రెట్లు అధికంగా ఏకంగా రూ.48,390 కోట్ల మొత్తానికి అమ్ముడుపోయాయి. రూ.23,575 కోట్లతో టీవీ ప్రసార హక్కులను స్టార్ ఇండియా(Star India) దక్కించుకుందని  బీసీసీఐ(BCCI) సెక్రటరీ జై షా(Jay Shah) ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. ఇక ఐపీఎల్ డిజిటల్ హక్కులను రిలయన్స్‌(Reliance)కు చెందిన వయాకామ్18(Viacom18) దక్కించుకుంది. టీవీ హక్కుల కంటే ఎక్కువ మొత్తం రూ.23,758 కోట్లతో డిజిటల్ హక్కులను దక్కించుకుందని జై షా వివరించారు. డిజిటల్ రంగం చక్కటి వృద్ధి సాధిస్తుండడం ఐపీఎల్‌కి కలిసొచ్చింది. దీంతో మొత్తంగా ఐపీఎల్ మీడియా హక్కుల మొత్తం విలువ రూ.48,390 కోట్లుగా ఉందని ప్రకటించారు.


ఐపీఎల్ మీడియా హక్కులు ఈ స్థాయిలో అమ్ముడుపోవడం సంతోషంగా ఉందని జై షా అన్నారు. భారీ వ్యాల్యూతో ఐపీఎల్ హక్కులు అమ్ముడుపోవడం బీసీసీఐ నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మ్యాచ్ వ్యాల్యూపరంగా స్పోర్టింగ్ లీగ్స్‌లో ఐపీఎల్ వరల్డ్ టాప్ 2 విలువైన బ్రాండ్‌గా ఉందని ఆయన వెల్లడించారు. ఐపీఎల్‌లో అభిమానుల అనుభూతిని మరింత పెంపొందించేందుకు అతిపెద్ద భాగస్వాములైన స్టేట్ అసోసియేషన్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఐపీఎల్ రూపంలో వచ్చిన ఆదాయాన్ని దేశీయంగా క్రికెట్ అభివృద్ధి కోసం ఖర్చుచేస్తామని జై షా తెలిపారు. దేశవ్యాప్తంగా క్రికెట్ సౌకర్యాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-06-15T01:59:25+05:30 IST