బ్రాండిక్స్ భేష్
ABN , First Publish Date - 2021-07-28T06:03:06+05:30 IST
శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డి. వెంకటేశ్వరన్ మంగళవారం బ్రాండిక్స్ కర్మాగారాన్ని సందర్శించారు.
శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ వెంకటేశ్వరన్ ప్రశంసలు
అచ్యుతాపురం, జూలై 27: శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ డి. వెంకటేశ్వరన్ మంగళవారం బ్రాండిక్స్ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దుస్తుల ఎగుమతులను సులభతరం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలను ప్రశంసించారు. అంతర్జాతీయ బ్రాండ్లు, లేబుళ్ల కోసం ఉత్పత్తుల తయారీలో అద్భుతమైన శిక్షణను మెచ్చుకున్నారు. అలాగే, గ్రామీణ మహిళా శ్రామిక శక్తిని పెంచినందుకు అభినందించారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌గా ఉన్న బ్రాండిక్స్‌లో 20 వేల మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రాండిక్స్‌లో గల అన్ని యూనిట్లపై ఆయన ఆరాతీశారు. ఉద్యోగినులతో కాసేపు మాట్లాడారు. ఈ పర్యటనలో బ్రాండిక్స్ ఇండియా కంట్రీ హెడ్ నీల్ రోసెరో, భారత భాగస్వామి దొరస్వామి, డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ చంద్రమౌళీశ్వరన్, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ ఉదిత వీరబాహు తదితరులు పాల్గొన్నారు.