ప్రభుత్వ షాపుల్లో మద్యం నిల్‌

ABN , First Publish Date - 2022-07-02T04:57:02+05:30 IST

వారం రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం దొరకడం లేదు. కేవలం బీర్లు, ఫుల్‌ బాటిల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ప్రభుత్వ షాపుల్లో మద్యం నిల్‌
పొదలకూరులో స్టాక్‌ లేక వెలవెలబోతున్న మద్యం దుకాణం

 బెల్టుషాపులు, దుకాణాల్లో ఫుల్‌

పొదలకూరురూరల్‌, జూలై 1 : వారం రోజులుగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం దొరకడం లేదు. కేవలం బీర్లు, ఫుల్‌ బాటిల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. బెల్టుషాపులు, ఫలసరుకులు, కూరగాయలు, శీతల పానీయాల దుకాణాల్లో మాత్రం ఫుల్లుగా లభ్యమవుతోంది. వాటిలో తెల్లవారుజాము నుంచే యథేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మండలంలో ఏడు ప్రభుత్వ షాపులు నడుస్తున్నాయి. వాటికి సమాంతరంగా బెల్టుషాపులు నడుస్తున్నాయి.   ప్రభుత్వ దుకాణాలకు బ్రాండ్లు వస్తున్నా వాటిని ప్రభుత్వ దుకాణాల సిబ్బంది పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  బయట దుకాణాల్లో  ఎమ్మార్పీ ధరపై రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. ఏ బ్రాండు కావాలన్నా ఇస్తామని బయటి వారు చెప్పడం గమనార్హం. ఇటీవల రెండు రోజులు రెండేళ్ల నాటి ఒక బ్రాండ్‌ షాపుల్లో కనిపించింది. బాటిల్‌ మీద రూ.250 ముద్రించి ఉన్నా ప్రస్తుతం  దాని రూ.200. కానీ సిబ్బంది దానిని బహిరంగంగా రూ.250 విక్రయించారు. ఎందుకంటే అసలు ధర ఎవరికీ గుర్తులేదు.  మద్యం దుకాణాల్లో జరిగే విషయాలు సంబంధిత అధికారులకే తెలిసి ఉంటాయనే విమర్శలున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సక్రమంగా నిర్వహించాలని మద్యం ప్రియు లు కోరుతున్నారు. 

Updated Date - 2022-07-02T04:57:02+05:30 IST