ఆస్ట్రాజెనెకా మూడో డోసు ట్రయల్స్‌కు బ్రెజిల్ గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2021-07-20T09:53:15+05:30 IST

కరోనా తీవ్రత అత్యధికంగా కనిపించిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఈ దేశంలో ఇప్పటి వరకూ సుమారు 2 కోట్ల కరోనా

ఆస్ట్రాజెనెకా మూడో డోసు ట్రయల్స్‌కు బ్రెజిల్ గ్రీన్‌సిగ్నల్

బ్రజీలియా: కరోనా తీవ్రత అత్యధికంగా కనిపించిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఈ దేశంలో ఇప్పటి వరకూ సుమారు 2 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రజలను కరోనా బారి నుంచి కాపాడేందుకు ఈ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మూడో డోసు వ్యాక్సిన్ ఇవ్వడంపై ట్రయల్స్ ప్రారంభించడానికి ఆస్ట్రాజెనెకాకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకున్న పదివేల మంది వాలంటీర్లకు ఇవ్వనున్నారు. రెండో డోసు తీసుకున్న 11 నుంచి 13 నెలల తర్వాత మూడో డోసు వ్యాక్సిన్ ఇచ్చి ట్రయల్స్ నిర్వహిస్తారని బ్రెజిల్ జాతీయ హెల్త్ సర్వైలెన్స్ ఏజెన్సీ (ఏఎన్‌వీఐఎస్ఏ) తెలిపింది. ఇలా చేయడం వల్ల ప్రజలకు కరోనా నుంచి మరింత రక్షణ లభిస్తే ప్రపంచంలోని చాలా దేశాలు మూడో డోసు వ్యాక్సిన్‌ ఇవ్వడానికి మొగ్గు చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2021-07-20T09:53:15+05:30 IST