కోవ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసిన బ్రెజిల్ ప్రభుత్వం

Jul 25 2021 @ 05:58AM

బ్రజీలియా: భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా కోవ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను బ్రెజిల్ నిలిపివేసింది. ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్ కోసం బ్రెజిల్‌కు చెందిన ప్రెకిసా మెడికామెంటోస్, ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్ సంస్థలు భారత్ బయోటెక్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడం, అలాగే బ్రెజిల్ ప్రభుత్వానికి రెండు కోట్ల వ్యాక్సిన్ డోసులు సప్లై చేయాలనే నిబంధన తీసుకురావడంతో.. ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ బయోటెక్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే బ్రెజిల్‌లోని ఫార్మా కంపెనీలు కోవ్యాక్సిన్ ట్రయల్స్‌ను నిలిపేసినట్లు ఆ దేశ హెల్త్ రెగ్యులేటర్ అన్‌విసా (ఏఎన్‌వీఐఎస్ఏ) తెలిపింది.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.