9ఏళ్ల చిన్నోడు.. టికెట్ లేకుండా 2,700 km విమానంలో ప్రయాణం.. అతడు చెప్పిన సీక్రెట్ విని అధికారులు షాక్..

ABN , First Publish Date - 2022-03-05T21:32:11+05:30 IST

ఆ చిన్నోడికి 9ఏళ్లే. కానీ టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించడం ఎలానో ఆ బుడతడికి తెలుసు. తనకు తెలిసిన టెక్నిక్స్‌తో పైసా ఖర్చు లేకుండా ఏకంగా సుమారు 2,700 కిలో మీటర్లు ప్రయాణించేశాడు. ఓ కు

9ఏళ్ల చిన్నోడు.. టికెట్ లేకుండా 2,700 km విమానంలో ప్రయాణం.. అతడు చెప్పిన సీక్రెట్ విని అధికారులు షాక్..

ఇంటర్నెట్ డెస్క్: ఆ చిన్నోడికి 9ఏళ్లే. కానీ టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించడం ఎలానో ఆ బుడతడికి తెలుసు. తనకు తెలిసిన టెక్నిక్స్‌తో పైసా ఖర్చు లేకుండా ఏకంగా సుమారు 2,700 కిలో మీటర్లు ప్రయాణించేశాడు. ఓ కుర్రాడు టికెట్ లేకుండా విమానంలో ప్రయాణించడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది నిజం. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే.. 



బ్రెజిల్‌లోని మనౌస్ ప్రాంతానికి చెందిన 9ఏళ్ల ఇమాన్యుయేల్ మార్క్వెస్.. సావో పాలో(Sao Paulo) పరిసరాల్లో ఉన్న తన కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఒంటరిగా ఇంట్లోంచి బయటికొచ్చేశాడు. తర్వాత స్థానికంగా ఉన్న ఎయిర్ పోర్ట్‌కు వెళ్లాడు. టికెట్ లేకుండానే అధికారుల కళ్లు కప్పి విమానం ఎక్కాడు. ఏకంగా 2,700 కిలో మీటర్ల దూరం ప్రయాణించేశాడు. విమానం Guarulhos‌లో ల్యాండ్ అయిన తర్వాత.. టికెట్ లేకుండా విమానం దిగిన ఇమాన్యుయేల్‌ను చూసి అక్కడి అధికారులు అవాక్కయ్యారు. అనంతరం ఇమాన్యుయేల్ చెప్పింది విని మరింత ఆశ్చర్యపోయారు. టికెట్‌ లేకుండా విమానంలో ఎలా ప్రయాణించాలనే అంశానికి సంబంధించి అనేక ట్యుటోరియల్ వీడియోలు చూశానని.. ఆ టెక్నిక్స్‌తోనే ఫ్లైట్ ఎక్కినట్టు వివరించడంతో అధికారులు బిత్తరపోయారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం బ్రెజిల్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో సెక్యూరిటీ సిబ్బందిని దాటి ఇమాన్యుయేల్ ఎలా విమానం ఎక్కాడనే అంశంపై మనౌస్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ విచారణ ప్రారంభించింది.




Updated Date - 2022-03-05T21:32:11+05:30 IST