తనను తానే పెళ్లాడిన యువతి గురించి విన్నారుగా.. ఇప్పుడు తాజాగా మరో యువతి ఎవరిని వివాహం చేసుకుందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-23T20:50:33+05:30 IST

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనతో తానే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

తనను తానే పెళ్లాడిన యువతి గురించి విన్నారుగా.. ఇప్పుడు తాజాగా మరో యువతి ఎవరిని వివాహం చేసుకుందో తెలిస్తే..

ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనతో తానే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బ్రెజిల్‌కు చెందిన మహిళ ఓ బొమ్మతో ప్రేమలో పడి, దానినే పెళ్లి చేసుకుంది. అంతేకాదు.. మరో చిన్న బొమ్మకు కూడా తల్లిగా మారింది. బ్రెజిల్‌కు చెందిన 37 ఏళ్ల మోరేస్ అనే మహిళ ఓ రాగ్ డాల్‌తో ప్రేమలో పడింది. మోరేస్‌కు ఆమె తల్లి ఆ బొమ్మను బహుమతిగా ఇచ్చింది. చూసిన వెంటనే దానితో మోరేస్ ప్రేమలో పడింది. ఆ బొమ్మకు మార్సెలో అని పేరు పెట్టింది.


ఇది కూడా చదవండి..

Viral Video: నెట్టింట నవ్వులు పూయిస్తున్న బుడ్డోడు.. మొట్టమొదటిసారి కేక్‌ను తిన్నాక చిన్నారి రియాక్షన్ అదుర్స్..


దాదాపు 250 మంది అతిథులు హాజరైన వేడుకలో మార్సెలో, మోరేస్‌ల పెళ్లి జరిగింది. అనంతరం ఇద్దరూ కలిసి రియో డి జనీరియోకు హనీమూన్‌కు కూడా వెళ్లారు. ఆ తర్వాత ఓ బేబీ డాల్‌ను తమ సంతానంగా స్వీకరించారు. `నా భర్త నన్ను ఎంతో అర్థం చేసుకుంటాడు. మార్సెలో ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటాడు. మార్సెలో గొప్ప, నమ్మకమైన భర్త. అలాంటి భర్త కావాలని మహిళలందరూ కోరుకుంటార`ని మోరేస్ చెప్పింది. అయితే తన భర్త సోమరి కావడం వల్ల అతను ఎక్కడికీ వెళ్లడని, తన సంపాదనతోనే కుటుంబం నడుస్తుందని ఆమె చెప్పింది.


`నేను నా భర్తతో చాలా సంతోషంగా ఉన్నాను. అయినప్పటికీ, ప్రజలు మా దాంపత్య జీవితాన్ని `నకిలీ` అంటుంటారు. అది నాకు చాలా కోపం తెప్పిస్తుంది. మా నాన్న, మా అమ్మ నిజాయితీగా ఉండాలని, మంచి వ్యక్తిగా ఉండాలని, నచ్చిన పని నిర్భయంగా చేయాలని చెప్పారు. అందుకే ఇతరుల కామెంట్లను పెద్దగా పట్టించుకోన`ని మోరేస్ చెప్పింది. 

Updated Date - 2022-06-23T20:50:33+05:30 IST