రామేశ్వరం మొగ తవ్వకాలకు మళ్లీ బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-06-27T06:48:59+05:30 IST

అల్లవరం, అమలాపురం రూరల్‌, ఉప్పలగుప్తం మండలాల పరిధిలో 35వేల ఎకరాల ఆయకట్టు ముంపునీరు సముద్రంలో దిగాల్సిన రామేశ్వరం మొగలో ఇసుక మేటల తొలగింపు పనులకు బ్రేక్‌ పడింది. ఇటీవల కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అల్ల వరం మండలం రామేశ్వరం మొగను సందర్శించి కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశాలిచ్చిన సంగతి విదితమే.

రామేశ్వరం మొగ తవ్వకాలకు మళ్లీ బ్రేక్‌!
రామేశ్వరం మొగలో నీరు దిశ మార్చుకున్న దృశ్యం

అల్లవరం, జూన 26: అల్లవరం, అమలాపురం రూరల్‌, ఉప్పలగుప్తం మండలాల పరిధిలో 35వేల ఎకరాల ఆయకట్టు ముంపునీరు సముద్రంలో దిగాల్సిన రామేశ్వరం మొగలో ఇసుక మేటల తొలగింపు పనులకు బ్రేక్‌ పడింది. ఇటీవల కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అల్ల వరం మండలం రామేశ్వరం మొగను సందర్శించి కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశాలిచ్చిన సంగతి విదితమే. ఆ తర్వాత రాష్ట్ర వ్యవసాయ మిషన వైస్‌ చైర్మన ఎంవీ ఎస్‌ నాగిరెడ్డి, అమలాపురం ఎంపీ చింతా అనురాధలు రామేశ్వరం మొగను సందర్శించి మొగలో ఇసుక మేటల తవ్వకాలను పరిశీలించారు. రామేశ్వరం మొగ ద్వారా డ్రెయిన్ల నుంచి ముంపు నీరు దిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నాగిరెడ్డి ప్రకటించిన రెండ రోజుల్లోనే రామేశ్వరం మొగ తవ్వకాలు వర్కు ఆర్డరు లేక అర్ధంతరంగా నిలిచి పోయాయి. రామేశ్వరం మొగలో ఆటోమెటిక్‌ షట్టర్లు వేసి రాతి కట్టడాలతో శాశ్వత  ప్రయోజనాలు చేకూర్చాలంటూ రైతులు చేస్తున్న విజ్ఞాపనలను పట్టించుకున్న నాథుడే లేడు. రూ.19 లక్షల నిధులతో డ్రైనేజీ శాఖ ఆధ్వర్యంలో రామేశ్వరం మొగలో పంచనది డ్రెయిన కలిసే ప్రాంతంలో 200 ఎక్స్స్‌కవటేర్లతో ట్రాక్టర్ల ద్వారా ఇసుకమేట తొలగింపు పనులు చేపట్టారు. వర్కు ఆర్డరు లేకపోవడంతో పనులను నిలిపివేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కురిసిన భారీ వర్షానికి డ్రెయినలో ముంపు నీరు చేరి ఇబ్బందిగా మారింది. ఇసుక మేటలు తొలగింపు పనులు పూర్తికాక ముంపు దిగక రైతులు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2022-06-27T06:48:59+05:30 IST