Viral Video: నిజంగా ఈ డాక్టర్‌కు దండం పెట్టాల్సిందే.. అప్పుడే పుట్టిన పాపకు ఆక్సిజన్ పెట్టినా చలనం లేకపోవడంతో..

ABN , First Publish Date - 2022-09-24T01:12:08+05:30 IST

మన ఆరోగ్యాన్ని కాపాడి ప్రాణాలను నిలబెట్టే వైద్యుడు (Doctor) దేవుడితో సమానం.

Viral Video: నిజంగా ఈ డాక్టర్‌కు దండం పెట్టాల్సిందే.. అప్పుడే పుట్టిన పాపకు ఆక్సిజన్ పెట్టినా చలనం లేకపోవడంతో..

మన ఆరోగ్యాన్ని కాపాడి ప్రాణాలను నిలబెట్టే వైద్యుడు (Doctor) దేవుడితో సమానం. వైద్యం అనే దానిని వృత్తిగా కాకుండా బాధ్యతగా భావించే ఎంతో మంది వైద్యులను ప్రజలు ఆరాధిస్తుంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ పసిబిడ్డకు డాక్టర్ ప్రాణం పోసిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇది పాత వీడియోనే అయినప్పటికీ తాజాగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఆగ్రాకు చెందిన వైద్యురాలు సురేఖ చౌదరి ఓ నవజాత శిశువుకు (New Born) నోటితో శ్వాస అందించి ప్రాణాలు కాపాడారు. 


ఆగ్రా (Agra)లోని సీహెచ్‌సీలో పుట్టిన ఓ ఆడపిల్ల ఏడవలేదు. పుట్టిన తర్వాత ఆ చిన్నారి శరీరంలో ఎలాంటి కదలికా లేదు. దీంతో ఆ శిశువుకు వెంటనే ఆక్సిజన్ అందించారు. అయినా ఆ చిన్నారిలో ఎలాంటి కదలికా కనిపించలేదు. దీంతో డాక్టర్ సురేఖ చౌదరి ఆ శిశువుకు తన నోటితో శ్వాస ఇవ్వడం ప్రారంభించారు. అలా దాదాపు 7 నిమిషాల పాటు కొనసాగించిన తర్వాత ఆ బిడ్డ శరీరంలో కదలిక వచ్చింది. 26 సెకెన్ల ఈ వీడియోను సచిన్ కౌశిక్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ వైద్యురాలి అంకిత భావానికి సెల్యూట్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు కూడా సురేఖను ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మంది వీక్షించారు.

Updated Date - 2022-09-24T01:12:08+05:30 IST