బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-01T06:25:34+05:30 IST

భవిష్యత్తులో బ్రాహ్మణులు రాజకీయంగా మరింత ఎదగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘ వేంద్ర పేర్కొన్నారు. 1990 తరువాత వచ్చిన మార్పు లతో బ్రాహ్మణులు రాజకీయంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 28: భవిష్యత్తులో బ్రాహ్మణులు రాజకీయంగా మరింత ఎదగాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఆకెళ్ల రాఘ వేంద్ర పేర్కొన్నారు. 1990 తరువాత వచ్చిన మార్పు లతో బ్రాహ్మణులు రాజకీయంగా వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పంచా యతీ ఎన్నికల్లో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు స్థానాల్లో ఎందరో బ్రాహ్మ ణులు విజయం సాధిం చడం హర్షణీయమన్నారు. బ్రాహ్మణ యువత రాజ కీయాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమలాపురంలో ఆదివారం ఆకొండి సింహాచలం సర్వీస్‌ ట్రస్టు, ఉపద్రష్ట కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వివిధ పదవులు పొందిన బ్రాహ్మణ సామా జిక వర్గానికి చెందినవారి సత్కార కార్యక్రమం నిర్వ హించారు. ప్రముఖ పంచాంగకర్త ఉపద్రష్ట నాగాదిత్యన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్ర ముఖ్యవక్తగా హాజరై నూతన సభ్యులకు దిశానిర్ధేశం చేశారు. అనంతరం పంచాయతీలో గెలు పొందిన వారిని సత్కరించి, తులసి కుండీలను అంద జేశారు. కార్యక్రమంలో ఆకొండి పవన్‌, మాచిరాజు రవి కుమార్‌, ఉపద్రష్ట విజయాదిత్య  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:25:34+05:30 IST