సీబీఎస్‌ఈ గుర్తింపు కోసం లంచం డిమాండ్‌

ABN , First Publish Date - 2020-07-07T07:57:12+05:30 IST

అన్ని అర్హతలున్నా.. ఓ పాఠశాలను పదోతరగతి సిలబస్‌ నుంచి కేంద్ర బోర్డు సిలబ్‌స(సీబీఎ్‌సఈ)కి మార్చేందుకు లంచం అడిగాడా అధికారి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు, అధికారితో పాటు ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను కూడా రెడ్‌

సీబీఎస్‌ఈ గుర్తింపు కోసం లంచం డిమాండ్‌

ఖైరతాబాద్‌, జూలై 6(ఆంధ్రజ్యోతి): అన్ని అర్హతలున్నా.. ఓ పాఠశాలను పదోతరగతి సిలబస్‌ నుంచి కేంద్ర బోర్డు సిలబ్‌స(సీబీఎ్‌సఈ)కి మార్చేందుకు లంచం అడిగాడా అధికారి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు, అధికారితో పాటు ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ను కూడా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజ్‌గిరి నాగారంలోని శాంతా మారియా పాఠశాల యాజమాన్యం తమ ఎస్‌ఎ్‌ససీ పాఠశాలకు సీబీఎ్‌సఈ గుర్తింపు కోసం మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తు అక్కడి నుంచి తెలంగాణ విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి 20 రోజుల క్రితం వచ్చింది. ఇక్కడ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇస్తే, ఆ దరఖాస్తుకు ఢిల్లీ నుంచి సీబీఎ్‌సఈ గుర్తింపు లభిస్తుంది. విద్యాశాఖ కార్యాలయంలో ప్లానింగ్‌ విభాగంలో సూపరింటెండెంట్‌గా విఽధులు నిర్వహిస్తున్న రాచమల్ల లక్ష్మణ్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ మానాజీ విపిన్‌రాజ్‌లు ఎన్‌ఓసీ జారీకై పాఠశాల సూపర్‌వైజర్‌ కె. శ్రీనివాస్‌ ను రూ. 45 వేలు డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ రూ. 40వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నటించి, ఏసీబీ అధికారుల్ని సంప్రదించాడు. సోమవారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో సైఫాబాద్‌లోని విద్యాశాఖ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా లక్ష్మణ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడికి సహకరించిన విపిన్‌రాజ్‌ను కూడా విచారించిన అధికారులు, వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు అనంతరం ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-07-07T07:57:12+05:30 IST