Viral Wedding Video: పెళ్లిలో ఇలా జరిగిందేంటి! వధూవరులు ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి మరీ..

ABN , First Publish Date - 2022-07-29T14:22:50+05:30 IST

వధూవరులకు సంబంధించిన ఓ వీడియో(Video) నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందరి ముందే పెళ్లిలోనే ఈ వధూవరులు ఇలా

Viral Wedding Video: పెళ్లిలో ఇలా జరిగిందేంటి! వధూవరులు ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: వధూవరులకు సంబంధించిన ఓ వీడియో(Video) నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ వీడియో చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాకుండా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అందరి ముందే పెళ్లిలోనే ఈ వధూవరులు ఇలా చేస్తే.. తర్వాత వీళ్ల జీవితం ఇంకెలా ఉంటుందో? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆ వధూవరులు ఇంతకూ ఏం చేశారనే వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరి నొకరు నచ్చారు. విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో పెద్దలు వాళ్ల పెళ్లి(Wedding) కి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వివాహాన్ని అంగరంగా వైభవంగా జరిపించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి సమయానికి స్నేహితులు, బంధువులు ఇతర అతిథులు అందరూ మంటపానికి చేరుకున్నారు. వధూవరులు(Bride and Groom) ఒకరి పక్కన మరొకరు కూర్చొని ఉండగా.. పురోహితుడు వేద మంత్రాలను ఉచ్ఛరిస్తూ వివాహ కార్యక్రామాన్ని జరిపిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా పురోహితుడు చేసిన సూచనలు పాటిస్తూ.. వధూవరులు ఒక్కసారిగా అందరికీ షాకిచ్చారు. ఒకరినొకరు నెట్టేసుకోవడమే కాకుండా.. ఒకరిపై మరొకరు పడి మరీ కొట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. కుటుంబ సభ్యులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయడంతో అదికాస్తా ఇపుడు వైరల్‌(Viral)గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. 




Updated Date - 2022-07-29T14:22:50+05:30 IST