Viral Video: పెళ్లి వేడుకలో వధూవరుల ఓవర్ యాక్షన్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

ABN , First Publish Date - 2021-12-15T22:15:49+05:30 IST

ఓ పెళ్లి వేడుకలో వధూవరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పెళ్లి జరుగుతున్న సంతోషంలో హద్దులు దాటి ప్రవర్తించారు.

Viral Video: పెళ్లి వేడుకలో వధూవరుల ఓవర్ యాక్షన్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!

ఓ పెళ్లి వేడుకలో వధూవరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పెళ్లి జరుగుతున్న సంతోషంలో హద్దులు దాటి ప్రవర్తించారు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వరుడి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. 


ఘజియాబాద్‌లోని సూర్య ఫామ్ హౌస్‌లో డిసెంబర్ 9న ఓ వివాహం జరిగింది. వివాహం అనంతరం వరుడు వేదిక పైన పిస్టల్ పట్టుకుని నిల్చున్నాడు. అనంతరం వధువు కూడా వరుడి చెయ్యి పట్టుకుంది. ఇద్దరూ కలిసి గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 10 సెకెన్ల ఆ వీడియో వైరల్ అయింది. ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, వరుడి కోసం వెతకడం ప్రారంభించారు.



Updated Date - 2021-12-15T22:15:49+05:30 IST