Viral Video: నాన్న కోసం.. పెళ్లి వేడుకలో చెల్లితో కలిసి డ్యాన్స్ చేసిన వధువు.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2022-09-05T01:59:08+05:30 IST

కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతోందంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు.

Viral Video: నాన్న కోసం.. పెళ్లి వేడుకలో చెల్లితో కలిసి డ్యాన్స్ చేసిన వధువు.. వీడియో వైరల్!

కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతోందంటే తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. తనను కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వెళ్లే సమయంలో ఆడపిల్లలు కూడా విలవిలలాడతారు. తాజాగా ఓ యువతి తన పెళ్లి వేడుకలో తన తండ్రి కోసం అంటూ వేదిక ఎక్కి డ్యాన్స్ చేసింది. ఆమె చెల్లెలు కూడా ఆ పాటలో కాలు కదిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. 


navikproductions అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌పై ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియోలో వధువు, ఆమె సోదరి అందమైన లెహంగాలు ధరించి వేదిక ఎక్కారు. `పాపా కెహ్తే హై`, `దిల్‌బరో` పాటలకు అదిరిపోయే స్టెప్పులేశారు. వారి డ్యాన్స్ చూసి కుటుంబ సభ్యులు, బంధువులు ఎమోషనల్ అయ్యారు. వధువు తండ్రి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. తన కుమార్తెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ వీడియో 43,900కు పైగా లైక్‌లు దక్కించుకుంది. 

Updated Date - 2022-09-05T01:59:08+05:30 IST