పెళ్లి వేదికపై స్వీట్ తినిపించబోతే.. వరుడి తీరు చూసి వధువు షాకింగ్ రియాక్షన్

ABN , First Publish Date - 2021-06-15T02:42:29+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ దేశంలో పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు.

పెళ్లి వేదికపై స్వీట్ తినిపించబోతే.. వరుడి తీరు చూసి వధువు షాకింగ్ రియాక్షన్

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ దేశంలో పెళ్లిళ్లు మాత్రం ఆగడం లేదు. తక్కువ మంది అతిథుల సమక్షంలోనే జరిగిపోతున్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న పెళ్లిళ్లలో ఏదో ఒక ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో వధువు ప్రవర్తించిన తీరు కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. 


వివాహ వేదిక మీద ఉన్న వధువు దగ్గరకు ఆమె స్నేహితులు స్వీట్‌ బాక్స్‌ తీసుకొచ్చి వరుడికి తినిపించాలని కోరారు. వధువు ఆ బాక్స్‌లోని ఒక స్వీట్‌ను తీసుకుని వరుడికి తినిపించేందుకు చేయి చాచింది. అయితే, ఆ స్వీట్‌ను అందుకునేందుకు వరుడు కాసేపు ఆలోచించాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చి ఆ స్వీట్‌ను నేలకేసి కొట్టింది. దీంతో వరుడు బిత్తరపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు `బాబీ.. కూల్‌..` అంటూ కామెంట్లు పెడుతున్నారు. 



Updated Date - 2021-06-15T02:42:29+05:30 IST