పెళ్లిపీట‌ల‌పై దూసుకొచ్చిన వ‌ధువు బాయ్‌ఫ్రెండ్.. అంద‌రూ చూస్తుండ‌గా ఆమెను ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2021-12-10T10:12:04+05:30 IST

అచ్చం సినీ ఫక్కీలో ఒక భగ్న ప్రేమికుడు తన ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా పెళ్లి పీటల వద్దకు దూసుకొచ్చాడు. వరుడు వధువు మెడలో పూలమాల వేయబోతుండగా.. అదే సమయంలో ఆ ప్రియుడు పెళ్లికూతురిని పట్టుకొని చేయకూడని పని చేశాడు...

పెళ్లిపీట‌ల‌పై దూసుకొచ్చిన వ‌ధువు బాయ్‌ఫ్రెండ్.. అంద‌రూ చూస్తుండ‌గా ఆమెను ఏం చేశాడంటే..

అచ్చం సినీ ఫక్కీలో ఒక భగ్న ప్రేమికుడు తన ప్రియురాలి పెళ్లి జరుగుతుండగా పెళ్లి పీటల వద్దకు దూసుకొచ్చాడు. వరుడు వధువు మెడలో పూలమాల వేయబోతుండగా.. అదే సమయంలో ఆ ప్రియుడు పెళ్లికూతురిని పట్టుకొని చేయకూడని పని చేశాడు. ఈ సంఘటనని ఆ వేడుకలో ఉన్నవారెవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఈ షాకింగ్ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో పెళ్లి జరుగుతున్న సమయంలో.. సరిగ్గా వరుడు పూలమాలను పెళ్లికూతురి మెడలో వేయడానకి వెళుతుండగా.. ఆమె లవర్ వేదికపైకి దూసుకొచ్చాడు. వధువు నుదుటిపై సింధూరం(కుంకుమ) రుద్దాడు. ఆ తరువాత తన జేబులో నుంచి మరికాస్త సింధూరం తీసుకొని మళ్లీ ఆమె తలపై బలవంతంగా రుద్దాడు. ఆపై ఆమెకు ఏదో హెచ్చరిస్తూ మాట్లాడాడు. 




ఇదంతా జరుగుతున్న సమయంలో పెళ్లికొడుకు నోరెళ్లబెట్టి చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆ ప్రేమికుడిని అందరూ కలిసి పట్టుకొని కొట్టబోతుండగా.. అతను వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఉత్తర భారతదేశంలో వధువు నుదుటిపై(తల పాపటిలో) వరుడు సింధూరం రుద్దితే వారిద్దరూ ఇకపై భార్యాభర్తలని అర్థం.

Updated Date - 2021-12-10T10:12:04+05:30 IST