పెళ్లైన 5 రోజులకే అల్లుడి నుంచి ఫోన్.. కూతురి గురించి చెప్పింది విని విస్తుపోయిన తండ్రి.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-01-01T22:10:56+05:30 IST

కూతురికి పెళ్లి వయసు రావడంతో.. ఆ తండ్రి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అబ్బాయిని చూసి తనకు ఉన్నంతలో కూతురి పెళ్లి జరిపించాడు. ఈ క్రమంలో ఆ నవవధువు.. అత్తారింట్లో అడుగుపెట్టింది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రదేశంలో నివాసం ఉంటుండటం

పెళ్లైన 5 రోజులకే అల్లుడి నుంచి ఫోన్.. కూతురి గురించి చెప్పింది విని విస్తుపోయిన తండ్రి.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: కూతురికి పెళ్లి వయసు రావడంతో.. ఆ తండ్రి సంబంధాలు చూడటం ప్రారంభించాడు. అబ్బాయిని చూసి తనకు ఉన్నంతలో కూతురి పెళ్లి జరిపించాడు. ఈ క్రమంలో ఆ నవవధువు.. అత్తారింట్లో అడుగుపెట్టింది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రదేశంలో నివాసం ఉంటుండటంతో.. అతడితోపాటు ఆ నవవధువు కూడా అక్కడకు వెళ్లిపోయింది. ఇవన్నీ కేవలం పెళ్లైన ఐదు రోజులకే జరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ రోజు సాయంత్రం అల్లుడి ఫోన్ చేసి చెప్పింది విని.. ఆ తండ్రి విస్తుపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


హర్యానాకు చెందిన గోల్డీ అనే యువతికి పెళ్లి చేయాలని ఆమె తండ్రి నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మధుబాన్ పోలీస్ అకాడమీలో కుక్‌గా పని చేస్తున్న అంగ్రేజ్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశాడు. అంగ్రేజ్‌తో కలిసి అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత ఉద్యోగ రీత్యా అతడు ఉండే ప్రాంతానికి వెళ్లిపోయింది. అంగ్రేజ్ సింగ్ కూడా తిరిగి విధుల్లో చేరాడు. ఎప్పటిలాగే డిసెంబర్ 31న డ్యూటీ వెళ్లి.. సాయంత్రం తిరిగొచ్చాడు. ఈ క్రమంలోనే తన ఇంటి వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడి ఉండటాన్ని చూసి కంగారు పడ్డాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి తన భార్యను చూసి కంగుతిన్నాడు. 



గోల్డీ ఉరికొయ్యకు వేలాడటం చూసి షాకయ్యాడు. అనంతరం వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అక్కడ గోల్డీని పరీక్షించిన వైద్యులు.. ఆమె అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో గోల్డీ తండ్రికి ఫోన్ చేసి, విషయం చెప్పాడు. దీంతో కూతురి మరణ వార్తను విని ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించిన సదరు తండ్రి.. తన అల్లుడు అంగ్రేజ్ సింగ్ కాల్ డిటేల్స్‌ను పరిశీలిస్తే తన కూతురు చావుకు కారణం తెలుస్తుందంటూ డిమాండ్ చేశాడు. కాగా.. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-01T22:10:56+05:30 IST