కొద్ది గంటల్లో పెళ్లి.. మండపానికి ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తే ఆ వరుడు చెప్పింది విన్న వధువుకు..

ABN , First Publish Date - 2021-07-30T22:59:17+05:30 IST

తోరణాలు కట్టేశారు. చుట్టాలందరూ వచ్చేశారు. పందిర్లు వేశారు. భోజనాల ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి.

కొద్ది గంటల్లో పెళ్లి.. మండపానికి ఇంకా రాలేదేంటని ఫోన్ చేస్తే ఆ వరుడు చెప్పింది విన్న వధువుకు..

ఇంటర్నెట్ డెస్క్: తోరణాలు కట్టేశారు. చుట్టాలందరూ వచ్చేశారు. పందిర్లు వేశారు. భోజనాల ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. మగ పెళ్లి వారికి ఫోన్ చేస్తే బ్యాండు మేళంతో బారాత్ మొదలైందని, వచ్చేస్తున్నామని చెప్పారు. ఆ మాట చెప్పి చాలా సేపయింది. ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. మగపెళ్లి వాళ్లు ఇంకా రాలేదు. ఏమైందో తెలియదు. పెళ్లి తంతు చూద్దామని అక్కడకు చేరుకున్న వాళ్లందరూ గుసగుసలు ప్రారంభించేశారు. అసలేమైందా? అనే టెన్షన్‌తో మగ పెళ్లి వాళ్లకు ఫోన్ చేసిన వధువు కుటుంబానికి దిమ్మతిరిగే సమాధానం వినిపించింది. అదేంటంటే.. వరుడికి కరోనా. మరో పధ్నాలుగు రోజులు అతను క్వారంటైన్‌లో ఉండాలి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్ ప్రాంతంలో జరిగింది.


ఉత్తరాఖండ్‌కు చెందిన ముంతాజ్ అనే యువకుడికి పెళ్లి సెట్ అయింది. అతని బంధువులందరూ కలిసి అమ్మాయి ఇంటికి బయలు దేరారు. అయితే అమ్మాయి ఉండేది ఉత్తరప్రదేశ్‌లో. దీంతో వాళ్లందర్నీ బోర్డర్ దగ్గరే ఆపేసిన పోలీసులు.. అందరికీ కరోనా టెస్టులు చేయాలని చెప్పారు. ఈ మాటలు విని పోలీసులతో ఈ బారాత్ బృందం గొడవకు దిగింది. పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో చివరకు టెస్టులు చేయించుకుంది. బారాత్‌లో 40మందికిపైగా ఉన్నారు. వాళ్లందరికీ నెగిటివ్ ఫలితాలే వచ్చాయి. ఒక్క పెళ్లికొడుక్కు తప్ప. అతనికి మాత్రం పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పోలీసులు కూడా పెళ్లి ఆపడం ఇష్టం లేక ఆ వరుడుకు మూడుసార్లు టెస్టులు చేశారు. మూడు సార్లూ అతనికి పాజిటివ్ ఫలితమే వచ్చింది. దీంతో ఆ బృందం మొత్తం వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ వరుడిని మాత్రం పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వధువు కుటుంబం నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో చిక్కకుంది. అంటే మరో 14 రోజుల తర్వాత మళ్లీ పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారిపోయింది.

Updated Date - 2021-07-30T22:59:17+05:30 IST