కొద్ది గంటల్లో పెళ్లనగా బైక్‌పై బయటకెళ్లిన వరుడు.. ఎంతకూ రాకపోవడంతో అంతా టెన్షన్.. వధువు చెప్పిన నిజంతో..

Dec 3 2021 @ 01:09AM

మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరితో వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఒక యువకుడు సరిగ్గా పెళ్లికి ముందు ఇంటి నుంచి పారిపోయాడు. కానీ అతను పారిపోవడానికి కారణం అదొక్కటే కాదని అతని కోసం పెళ్లిపీటలపై వేచి చూసిన పెళ్లికూతురు అసలు నిజం బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝన్‌ఝును నగరంలో జరిగింది.


ఝన్‌ఝును నగర సమీపంలోని సూరజ్‌గఢ్ గ్రామంలో నివసించే రవి కుమార్(22)కు పక్క గ్రామానికి చెందిన మీనా(పేరు మార్చబడినది)తో ఇంటి పెద్దలు నిశ్చయించారు. వారిద్దరికీ కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయింది. నవంబర్ 29న రవికుమార్, మీనాకు పెళ్లి జరాగాల్సి ఉండగా.. పెళ్లికొడుకు రవికుమార్ ఇంటి నుంచి బైక్‌పై బయటికెళ్లాడు. అలా వెళ్లినవాడు ఎంతసేపటికీ తిరిగిరాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు రవికుమార్ కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. మరోవైపు పెళ్లికొడుకు వారు వస్తారని మీనా పెళ్లికూతురుగా ముస్తాబై ఎదరుచూస్తోంది. కానీ ఆ రోజు పెళ్లికొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయారని, ఇక ఆ పెళ్లి జరగదని మీనాకు తెలిసింది.


పోలీసులు మరుసటిరోజు రవికుమార్‌ని అరెస్టు చేశారు. అతడు ఒక అమ్మాయితో కలిసి ఊరివదిలి వెళ్లిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. రవి కుమార్‌ని పోలీసులు ప్రశ్నించగా.. అతడు తనకు మీనాను పెళ్లిచేసుకోవడం ఇష్టంలేదని, మరో అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న మీనా పోలీసులకు రవికుమార్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. ఎంగేజ్‌మెంట్ తరువాత తనను ప్రేమ పేరుతో శృంగారం చేశాడని చెప్పింది. అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అత్యాచారం కేసు పెట్టింది.


మీనా చేసిన ఫిర్యాదుతో ఇరు కుటుంబాల సభ్యులు షాక్‌కు గురయ్యారు. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు.


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.