క్షణాల క్రితమే వివాహం.. పట్టరాని సంతోషంతో అందరికీ షాకిచ్చిన నవవధువు .. నెట్టింట వైరల్!

ABN , First Publish Date - 2022-03-13T20:55:51+05:30 IST

మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడిన కొద్ది సమయానికే ఓ వనవధువు అందరికీ షాకిచ్చింది. వరుడు సహా పెళ్లికి వచ్చిన అతిథులు చూస్తుండగానే ఆమె చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో

క్షణాల క్రితమే వివాహం.. పట్టరాని సంతోషంతో అందరికీ షాకిచ్చిన నవవధువు .. నెట్టింట వైరల్!

ఇంటర్నెట్ డెస్క్: మనసుకు నచ్చిన వ్యక్తిని మనువాడిన కొద్ది సమయానికే ఓ వనవధువు అందరికీ షాకిచ్చింది. వరుడు సహా పెళ్లికి వచ్చిన అతిథులు చూస్తుండగానే ఆమె చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు.. సంతోషాన్ని ఇలా కూడా వ్యక్త చేస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



వివాహ వేడుకల్లో సరదాలు, సంతోషాలకు కొదవ ఉండదు. ఈ క్రమంలోనే ఓ నవవధువు తన ఆనందాన్ని భిన్నంగా వ్యక్త పరిచింది. ఇష్టపడిన వ్యక్తిని పెళ్లాడిన తర్వాత వివాహ దుస్తుల్లో మండపం నుంచి బయటికొచ్చి తుపాకీ చేతపట్టింది. ఉప్పొంగే సంతోషంతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపింది. దీంతో వివాహానికి హాజరైన అతిథులు షాకయ్యారు. కొందరు ఆ దృశ్యాలను తమ ఫోన్‌లలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీడియోలు, ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి. 






Updated Date - 2022-03-13T20:55:51+05:30 IST