నవ వధువుకు బెలూన్లు కట్టి ఎగరేశారు.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-04-20T14:12:01+05:30 IST

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక ఉదంతం..

నవ వధువుకు బెలూన్లు కట్టి ఎగరేశారు.. ఆ తరువాత..

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక ఉదంతం వైరల్‌గా మారుతుంటుంది. అయితే వీటిలో పెళ్లికి సంబంధించిన వీడియోలకు అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. అలాగే ఇటువంటి వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా పెళ్లికి సంబంధించిన ఒక ఫన్నీ వీడియో వివిధ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో సందడి చేస్తోంది. పెళ్లయిన తర్వాత ఇలా జరగడం మునుపెన్నడూ చూసివుండరు. ఈ తాజాగా వీడియోలో పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఒక కుర్చీకి బెలూన్లు కట్టి. దానిలో పెళ్లికూతురును కూర్చోబెట్టారు. కొద్ది క్షణాల్లోనే పెళ్లికూతురు గాలిలోకి ఎగరడం వీడియోలో కనిపిస్తుంది. అది చూసిన అతిథులు  ఆనందిస్తుంటారు. కొద్దిసేపటి తర్వాత వధువును తాడు సాయంతో నేలపైకి తీసుకువచ్చారు. 


Updated Date - 2022-04-20T14:12:01+05:30 IST