పెళ్లి వేదికపై ఫోన్లో ఫుల్లు బిజీగా ఉన్న వధువు.. వరుడి పరిస్థితి గురించి నెట్టింట ఫన్నీ కామెంట్స్..

Sep 18 2021 @ 12:24PM

స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడం మానవ జీవితంలో పెను మార్పులకు కారణమైంది. స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎన్నో పనులు సులభంగా జరిగిపోతుండడంతో దానిని వదలి ఉండలేని పరిస్థితి నెలకొంది. ఏ పని చేస్తున్నా పక్కన ఫోన్ ఉండాల్సిందే. తాజాగా ఓ వధువు పెళ్లి వేదిక మీద కూర్చుని కూడా ఫోన్, ల్యాప్‌టాప్‌తో బిజీగా కనిపించింది. 

పక్కనే కూర్చున్న వరుడి వైపు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు. ఒకవైపు ల్యాప్‌టాప్‌లో చూస్తూ, మరోవైపు ఫోన్ మాట్లాడుతూ బిజీబిజీగా గడిపింది. వరుడు ఆమె వైపు చూస్తూ కూర్చున్నాడు. ఈ వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. `పాపం.. వరుడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది..`, `ఇకపై భార్యతో మాట్లాడాలంటే అతను ఫోన్‌ను ఆశ్రయించాల్సిందే..` అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.