అత్తకి టీ ఇచ్చి మేడ పైకి వెళ్లిన కోడలు.. ఎంతకీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-04-12T22:46:30+05:30 IST

ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి లేటు వయసులో వివాహం జరిగింది.. రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది..

అత్తకి టీ ఇచ్చి మేడ పైకి వెళ్లిన కోడలు.. ఎంతకీ కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..

ఎన్నో ప్రయత్నాల తర్వాత అతనికి లేటు వయసులో వివాహం జరిగింది.. రెండు నెలల క్రితం పెళ్లి జరిగింది.. నగల కొట్టులో పని చేసే భర్త, భార్యను అపురూపంగా చూసుకున్నాడు.. గత నెల 13వ తేదీన ఆ మహిళ తన అత్తగారికి టీ ఇచ్చి మేడ మీదకు వెళ్లింది.. ఎంతసేపటికీ కోడలు కిందకు రాకపోవడంతో అనుమానం వచ్చి అత్త పైకి వెళ్లింది.. అక్కడ కోడలు కనిపించలేదు.. చీర సహాయంతో కోడలు కిందకు దిగిపోయినట్టు అత్త గుర్తించి కొడుక్కి ఫోన్ చేసింది.. షాకైన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


రాజస్థాన్‌లోని నాగౌర్‌కు చెందిన నత్మల్ సోనీ నగల వ్యాపారిగా జీవనం సాగిస్తున్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత మధ్యవర్తుల సహాయంతో ఫిబ్రవరి 1న కాజల్ అనే యువతితో అతనికి వివాహం జరిగింది. నెలన్నర రోజుల అనంతరం మార్చి 13న కాజల్ తన అత్తగారికి టీ ఇచ్చి మేడ తుడిచి వస్తానని చెప్పి పైకి వెళ్లింది. కాజల్ ఎంతసేపటికీ కిందకు రాకపోవడంతో అత్తకు అనుమానం వచ్చి మేడ ఎక్కింది. ఎక్కడా కాజల్ జాడ కనిపించలేదు. ఆమె మేడ మీద నుంచి దూకి పారిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానించారు. 


ఇంట్లోని బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన 5 తులాల బంగారం, 20 తులాల వెండి, కొంత నగదు, ఇతర వస్తువులు కనిపించకుండా పోయాయి. దీంతో మధ్యవర్తులను నత్మల్ నిలదీశాడు. రూ.50 వేలు తమ అకౌంట్‌లో డిపాజిట్ చేస్తే కాజల్‌ను పంపిస్తామని వారు చెప్పారు. షాక్‌కు గురైన నత్మల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో నత్మల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.  

Updated Date - 2022-04-12T22:46:30+05:30 IST