యువతి వింత కండీషన్‌.. వయసులో పెద్దదని తెలిసి కూడా సరేనన్న వరుడు.. పెళ్లైన మూడ్రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2022-01-09T01:06:27+05:30 IST

అతడి వయసు 31ఏళ్లు. కొన్ని సంవ్సరాల క్రితమే వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర క్రితం భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అనంతరం రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ యువతి పరిచయమైంది. తన గురించి అన్ని వివ

యువతి వింత కండీషన్‌.. వయసులో పెద్దదని తెలిసి కూడా సరేనన్న వరుడు.. పెళ్లైన మూడ్రోజుల తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: అతడి వయసు 31ఏళ్లు. కొన్ని సంవ్సరాల క్రితమే వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఏడాదిన్నర క్రితం భార్యకు విడాకులు ఇచ్చేశాడు. అనంతరం రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడికి ఓ యువతి పరిచయమైంది. తన గురించి అన్ని వివరాలు చెప్పి.. ఇష్టమైతే పెళ్లి చేసుకుందామంటూ యువతి ముందు అతడు తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. పెళ్లికి అంగీకరించిన ఆ యువతి.. ఓ కండీషన్ పెట్టింది. షరతుకు ఓకే అంటే పెళ్లి చేసుకుందామని స్పష్టం చేసింది. యువతి తన కంటే ఏడాది పెద్దదని తెలిసి కూడా.. ఆమె పెట్టిన షరతుకు అతడు ఓకే చెప్పాడు. ఈ నేపథ్యంలోనే వారికి తాజాగా వివాహం జరిగింది. అయితే పెళ్లైన మూడు రోజుల తర్వాత ఆ నవవధువు చేసిన పనికి అంతా షాకయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతానికి చెందిన కమలేష్ సాహూకు కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆమెకు ఏడాదిన్నర క్రితం విడాకులు ఇచ్చేశాడు. అప్పటి నుంచి కమలేష్ రెండో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మధ్యవర్తి ద్వారా ఇండోర్‌లోని 32ఏళ్ల పూజ చౌదరి పరిచయం అయింది. అయితే తన గురించి అన్ని విషయాలు చెప్పిన కమలేష్.. అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామని పూజకు తెలిపాడు. పెళ్లి అంగీకరించిన ఆ యువతి.. ఓ కండీషన్ పెట్టింది. తన కుటుంబానికి రూ.3లక్షల అప్పులు ఉన్నాయని.. అవి తీరుస్తానంటేనే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ అప్పు తీర్చేందుకు కమలేష్ ఒప్పుకున్నాడు. 



ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పూజను కమలేష్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన వెంటనే ముందుగా మాట్లాడుకున్నట్టు రూ.3లక్షలను పూజ కుటుంబ సభ్యుల చేతిలో పెట్టాడు. పెళ్లైన మూడు రోజుల తర్వాత తన బాబాయ్‌కి ఆరోగ్యం బాగోలేదని.. చికిత్స కోసం లక్ష రూపాయలు కావాలని కమలేష్‌ను కోరింది. దీంతో ఆ మొత్తాన్ని కమలేష్ అప్పు తీసుకొచ్చి పూజ చేతికి ఇచ్చాడు. ఆ డబ్బులతో ఇల్లు దాటిన పూజ.. ఫోన్ స్విచ్ఛాప్ చేసింది. ఎంత ప్రయత్నించిన ఫోన్ కలవకపోవడంతో.. కమలేష్‌కు అనుమానం వచ్చింది. ఇంట్లో పరిశీలించి నగలతోపాటు పూజ పారిపోయినట్టు గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని ఇండోర్ వెళ్లాడు. అక్కడ పూజ పుట్టింటికి తాళం ఉండటంతో కంగుతిన్నాడు. వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుసుకుని.. పోలీసులకు ఆశ్రయించాడు. పూజ ఫోటోను అధికారులకు చూపించి జరిగింది చెప్పాడు. ఈ క్రమంలో అధికారులు చెప్పింది విని కమలేష్ సహా కుటుంబ సభ్యులు నోరెళ్లబెట్టారు. పూజ ఇంతకుముందు కూడా ఇలా చాలా మందిని మోసం చేసిందని తెలుసుకుని విస్తుపోయాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 




Updated Date - 2022-01-09T01:06:27+05:30 IST