అందంగా ముస్తాబై.. డ్యాన్స్ ఇరగదీసిన నవ వధువు.. నెటిజన్లు ఫిదా!

ABN , First Publish Date - 2021-10-25T02:12:10+05:30 IST

ఈ మధ్య ఓ నవ వధువు ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్ర

అందంగా ముస్తాబై.. డ్యాన్స్ ఇరగదీసిన నవ వధువు.. నెటిజన్లు ఫిదా!

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య ఓ నవ వధువు ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు స్టెప్పులేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో.. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మరో నవ వధువుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండగా.. ఆ వీడియో చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 



పెళ్లి తర్వాత నవ వధువు కన్నీళ్లు పెట్టుకుంటూ అత్తారింటికి వెళ్లేది. అయితే అదంతా గతం. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. సంతోషాన్ని రెట్టింపు చేసుకునేందుకు వధూవరులు డ్యాన్సులతో ఇరగదీస్తున్నారు. ఈ క్రమంలోనే.. అందంగా ముస్తాబై పెళ్లి మండపంలోకి అడుగుపెట్టిన ఓ నవ వధువు కాబోయే వాడి ముందే ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ ఫిదా చేసింది. తన హావభావలతో అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. నవ వధువు స్టెప్పులేస్తుండా కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు స్పందిస్తూ ‘వావ్.. అదరగొట్టావ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 






Updated Date - 2021-10-25T02:12:10+05:30 IST