Guests to Pay for Wedding Meals: వధువుకు వింత ఆలోచన.. పెళ్లి భోజనం చేసే అతిథుల నుంచి డబ్బులు వసూలు!

ABN , First Publish Date - 2022-08-12T20:24:30+05:30 IST

జీవితంలో అతి ముఖ్యమైన వివాహ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.

Guests to Pay for Wedding Meals: వధువుకు వింత ఆలోచన.. పెళ్లి భోజనం చేసే అతిథుల నుంచి డబ్బులు వసూలు!

జీవితంలో అతి ముఖ్యమైన వివాహ వేడుకను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అప్పు చేసైనా సరే వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. బంధుమిత్రులను పిలిచి విందు భోజనం పెట్టాలనుకుంటారు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఇవేవీ కుదరవు. ప్రతి విషయంలోనూ రాజీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక వధువు ఫేస్‌బుక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral post) మారింది. ఆ పోస్ట్ ప్రకారం.. ఆ యువతికి వివాహం నిశ్చయమైంది. ఆక్టోబర్‌లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. 


ఇది కూడా చదవండి..

6 thousand crores: తన అకౌంట్ చెక్ చేసుకున్న బీహార్ వ్యక్తికి షాక్.. ఏకంగా రూ.6 వేల కోట్లు..


`పెళ్లికి హాజరై భోజనం చేసిన అతిథులను డబ్బు కట్టాలని ఎవరైనా అడిగారా? (Pay for Wedding Meals) ప్రస్తుతం ప్రతి వస్తువూ చాలా ఖరీదైనదిగా మారిపోయింది. ఆ ఖర్చు భరించలేకపోతే.. అక్టోబరులో జరగాల్సిన మా పెళ్లిని వాయిదా వెయ్యాలి. లేదంటే అతిథులను పిలవడం మానెయ్యాలి. లేదా మా అతిథుల నుంచి భోజనం కోసం డబ్బు తీసుకోవాలి (Guests to Pay for Meals). అదే వారిచ్చే బహుమతి అనుకుంటాం. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియడం లేదు. నేను అందరికీ ఆహ్వానాలు పంపాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. నాకు చాలా బాధగా ఉంద`ని ఆ మహిళ తెలిపింది.


ఆ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి ఆలోచనలు చాలా మందికి షాకిచ్చాయి. పెళ్లిలో డబ్బులో తీసుకుని భోజనం పెట్టడమేంటని కొందరు ప్రశ్నించారు. అలా డబ్బులు అడిగే కంటే ఎవరినీ పెళ్లికి పిలవకపోవడమే మంచిదని అన్నారు. కాగా, కొందరు మాత్రం ఆమె ఆలోచనలను సమర్థించారు. 

Updated Date - 2022-08-12T20:24:30+05:30 IST