Brigadier LS Lidder మృతదేహమున్న శవపేటికను ముద్దాడిన భార్య,భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కూతురు

ABN , First Publish Date - 2021-12-10T18:06:36+05:30 IST

మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ లఖ్విందర్ సింగ్ లిడ్డర్ భార్య అతని శవపేటికను ముద్దాడింది...

Brigadier LS Lidder మృతదేహమున్న శవపేటికను ముద్దాడిన భార్య,భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కూతురు

ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లో అలముకున్న విషాదం

న్యూఢిల్లీ: మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ లఖ్విందర్ సింగ్ లిద్దర్ భార్య చివరిసారిగా అతని శవపేటికను ముద్దాడింది. బ్రిగేడియర్ కూతురు తండ్రి మృతదేహాన్ని చూసి భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది.అత్యంత విషాదకరమైన ఈ ఘటన ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్‌లో శ్మశానవాటికలో శుక్రవారం కనిపించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్ కు అతని భార్య, కుమార్తె ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో ఆయనకు నివాళులర్పించారు.జాతీయ జెండా, పూలతో అలంకరించిన లిద్దర్ శవపేటికను అతని భార్య ముద్దాడింది. అతని కుమార్తె తండ్రి శవపేటికపై పూల రేకులను ఉంచి కన్నీళ్లు పెట్టుకుంది.


చాలా మంది సీనియర్ రక్షణ సిబ్బంది కూడా బ్రార్ స్క్వేర్ వద్ద బ్రిగేడియరుకు చివరిసారిగా నివాళులర్పించారు.1969వ సంవత్సరం జూన్ 26వతేదీన జన్మించిన బ్రిగేడియర్ లిద్దర్ 2021జనవరి నుంచి సీడీఎస్ కు డిఫెన్స్ అసిస్టెంట్‌గా ఉన్నారు.అతను డిసెంబర్ 1990లో జమ్మూకాశ్మీర్ రైఫిల్స్ లో పనిచేశారు. యూఎన్ శాంతి పరిరక్షక దళంగా కాంగో బెటాలియన్‌కు నాయకత్వం వహించాడు. లిద్దర్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా, కజకిస్తాన్‌లో డిఫెన్స్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.బ్రిగేడియర్ లిద్దరుకు భార్య గీతిక లిద్దర్, ఒక కుమార్తె ఉన్నారు.


Updated Date - 2021-12-10T18:06:36+05:30 IST