cpm: మోదీ జేబుదొంగ: బృందా కారత్

ABN , First Publish Date - 2022-09-23T21:33:47+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబుదొంగ... జీఎస్టీ రూపంలో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్ అన్నారు.

cpm: మోదీ జేబుదొంగ: బృందా కారత్

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జేబుదొంగ... జీఎస్టీ రూపంలో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్(Brinda Karat) అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పుట్టపర్తిలో సీపీఎం(cpm) దేశ రక్షణ రణభేరి నిర్వహించింది. పుట్టపర్తి పురవీధుల్లో భారీ ర్యాలీ తీశారు. హనుమాన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున  రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఓబులు రాంభూపాల్ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా బృందాకారత్ మాట్లాడుతూ.. ఏటా పేద ప్రజల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ(GST) రూపంలో కేంద్ర ప్రభుత్వం( Central Govt) పన్నులు వసూలు చేస్తోందని మండిపడ్డారు. ఏటేటా అదానీ, అంబానీ(Adani Ambani) ఆస్తులు పెరుగుతున్నాయని, ప్రపంచ కుబేరుల్లోనే అదానీ రెండో స్థానానికి చేరుకున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ( Narendra Modi), అమిత్ షా (Amit Shah) రాజ్యాంగ శక్తులుగా అవతరించారన్నారు. మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్(RSS) బ్రిటిష్ పాలకుల మాదిరిగా విభజించు పాలించు రీతిలో పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. మోదీ ఆంధ్రకు ఒరగబెట్టింది ఏమి లేదని,  ప్రత్యేక హోదా ఇవ్వకుండా మొండి చేయి చూపారని మండిపడ్డారు.ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN REDDY)  నోరు మెదపరని.. జగన్ నోటికి ఫెవికాల్ వేసుకున్నారని ధ్వజమెత్తారు. నిరుపేదలకు సెంటు స్థలం ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్.. అదానీ ఎనర్జీ గ్రూపుకు 72 వేల ఎకరాలు ధారధత్తం చేశారని దుయ్యబట్టారు.జగనన్న ఇల్లు ఎక్కడ.. జగన్ ఎక్కడ అని ప్రశ్నించారు. జగన్ నిరుపేదలకు అన్నానా లేదా అదానీకి అన్న అని బృందా కారత్ నిలదీశారు. 

Updated Date - 2022-09-23T21:33:47+05:30 IST