ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

గ్రామాల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకునేలా ఒత్తిడి తీసుకురావాలని సర్పంచ్‌లకు యూటీఎఫ్‌ నేతలు కోరారు. ‘మన ఊరి బడిని కాపాడు కుందాం’లో భాగంగా శనివారం నందిగాం, రాంపురం సర్పంచ్‌లు జడ్యాడ రమ ణమ్మ, పినకాన జోగారావు, నాయకులు పి.రవిబాబు, జె.జయరాం, నారాయ ణరావులను కలిసి వినతిపత్రాలను అందించారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి
హరిపురం: సర్పంచ్‌లకు వినతిపత్రం అందజేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

నందిగాం: గ్రామాల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకునేలా ఒత్తిడి  తీసుకురావాలని సర్పంచ్‌లకు యూటీఎఫ్‌ నేతలు కోరారు. ‘మన ఊరి బడిని కాపాడు కుందాం’లో భాగంగా శనివారం నందిగాం, రాంపురం సర్పంచ్‌లు జడ్యాడ రమ ణమ్మ, పినకాన జోగారావు, నాయకులు పి.రవిబాబు, జె.జయరాం, నారాయ ణరావులను కలిసి వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయకులు బాలక శంకరరావు, ఎల్‌.అప్పలస్వామి, కె.దాలయ్య, పి.ధర్మారావు తది తరులు పాల్గొన్నారు. 


సర్క్యులర్‌ 172ని రద్దు చేయండి

 హరిపురం: జాతీయ విద్యావిధానంలో భాగంగా తీసు కొచ్చిన సర్క్యులర్‌-172 ను రద్దుచేసి ప్రతికూల అంశాలను  తొలగించాలని యూ టీఎఫ్‌ జిల్లా కార్యదర్శి గుంట కోదండరావు డిమాండ్‌ చేశారు. శనివారం మందస మండలంలోని అంబుగాం ఉన్నత పాఠశాల ఆవరణలో చర్చాగోష్టి నిర్వహించారు. అనంతరం పితాతోళి, బీఎస్‌పురం, వీజీపురం, అంబుగాం సర్పంచ్‌లకు వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో చౌదరి మురళీకృష్ణ, అప్పాకుమారి,  సోమేశ్వరరావు పాల్గొన్నారు. 


ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలి

  రాజాం రూరల్‌: సర్క్యులర్‌ 172 రద్దు చేయాలని, ప్రాథమిక పాఠశాలలను కొనసాగించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు రెడ్డి మోహనరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలు గ్రామాల్లో శనివారం పర్యటించారు. ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తర గతుల్ని ఉన్నత పాఠశాలలకు తరలిస్తే కలిగే అనర్థాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు.  కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాజాం మండల శాఖ ప్రతినిధులు రమేష్‌, డి.వెంకటరావు, బలివాడ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST