దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-03T00:44:07+05:30 IST

దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి

దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశమంతా తిరిగి విప్లవం తీసుకొని రండని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆ హక్కును మీకు రాజ్యాంగం హక్కు కలిపించిందని, మీకు స్వేచ్ఛగా తిరిగే అధికారం ఉందని ఆయన అన్నారు. పార్లమెంట్‌లో బడ్జిట్ ప్రవేశ పెట్టిన అనంతరం ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సందర్భంగా ఆయన ప్రతిస్పందించారు. తెలంగాణ కోసం అమరవీరులు చనిపోతే వారికి న్యాయం కూడా చేయలేకపోయారన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి మద్యం తెలంగాణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏడు ఏళ్ల నుంచి రేషన్ కార్డులు లేవన్నారు. రాష్ట్రంలో సచివాలయం లేదని, సచివాలయానికి సీఎం రారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలని, మంత్రులను సీఎం కలవరన్నారు. రాజ్యాంగానికి మీరు  ఏమైనా అతీతమైన శక్తా అని ఆయన దుయ్యబట్టారు.


శత్రువైన పాకిస్థాన్ ప్రధాని కూడా ప్రధాని మోడీని  విమర్శించలేదని, కానీ కేసీఆర్ మాటలు వింటే బాధేస్తోందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదని ఆయన ప్రశ్నించారు. పుత్ర మమకారం, కుటుంబ మమకారం కోసం కేసీఆర్ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.  తెలంగాణలో మనం ఉన్న లేకపోయినా(బీజేపీ,టీఆర్‌ఎస్,పార్టీలు) తెలంగాణ శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించకండని, అది మంచిది కాదని కేసీఆర్‌కు ఆయన హితవు పలికారు. ఎన్నో త్యాగాలతో వచ్చిన తెలంగాణ మీ  కుటుంబ సొత్తు కాదని, దానిపై అందరికి హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-03T00:44:07+05:30 IST