గ్రామ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా

ABN , First Publish Date - 2021-04-24T04:52:19+05:30 IST

గ్రామ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా

గ్రామ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తా
పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్న డీపీవో శ్రీనివాస్‌రెడ్డి

  • డీపీవో శ్రీనివాస్‌రెడ్డి

మొయినాబాద్‌ రూరల్‌ : గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన సీసీ రోడ్డు పనులు, మిషన్‌ భగీరథ నీటి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హిమయత్‌నగర్‌ గ్రామాన్ని ఆయన తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఆస్తిపన్ను, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియతో పాటు ఆడిటింగ్‌ విషయాలను పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణ, తడి, పొడి చెత్త సేకరణ, పారిశుధ్య పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్‌ మంజులారవియాదవ్‌ గ్రామంలో ఆర్‌అండ్‌బీ సీసీ రోడ్డు అర్ధాంతరంగా నిలిచిపోయిందని, మిషన్‌ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని డీపీవోకు తెలిపారు. ఆయన త్వరలోనే కలెక్టర్‌కు వివరించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైకుంఠధామంతో పాటు డంపింగ్‌యార్డును పరిశీలించారు. కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్‌ పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాఘవేందర్‌, నాయకులు రవియాదవ్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:52:19+05:30 IST