తృటిలో తప్పిన ప్రమాదం.. Pilot అలా చేసుండకపోతే..!

ABN , First Publish Date - 2022-02-02T22:38:19+05:30 IST

విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే ఘోర ప్రమాదం చోటు చేసుకునేంది. ప్రస్తుతం అం

తృటిలో తప్పిన ప్రమాదం.. Pilot అలా చేసుండకపోతే..!

లండన్: విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే ఘోర ప్రమాదం చోటు చేసుకునేంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన 1307 విమానం అబేర్డీన్ నుంచి లండన్‌ హీత్రో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే సమయానికి బలమైన గాలులు వీచాయి. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానం రన్‌వేపై తొణికిసలాండి. ఈ క్రమంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. బలవంతంగా విమానాన్ని ల్యాండ్ చేయకుండా.. తిరిగి టేకాఫ్ చేశాడు. అనంతరం తిరిగి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 






Updated Date - 2022-02-02T22:38:19+05:30 IST