భారతీయ విద్యావేత్తకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం

ABN , First Publish Date - 2022-01-02T16:08:45+05:30 IST

భారతీయ విద్యావేత్త, హౌస్ ఆఫ్ లార్డ్స్ పీర్ అజయ్ కుమార్ కక్కార్‌కు బ్రిటన్ అత్యున్నత పురస్కారం 'కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్(కేబీఈ)' వరించింది.

భారతీయ విద్యావేత్తకు బ్రిటన్ అత్యున్నత పురస్కారం

లండన్: భారతీయ విద్యావేత్త, హౌస్ ఆఫ్ లార్డ్స్ పీర్ అజయ్ కుమార్ కక్కార్‌కు బ్రిటన్ అత్యున్నత పురస్కారం 'కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్(కేబీఈ)' వరించింది. 1,278 మందితో శుక్రవారం విడుదల చేసిన బ్రిటన్ వార్షిక న్యూఇయర్ ఆనర్స్ లిస్ట్‌లో కక్కార్‌తో పాటు మరో 50 మంది భారత సంతతి ప్రముఖులకు చోటు దక్కింది. కక్కార్ ప్రస్తుతం లండన్ యూనివర్సిటీ కళాశాలలో ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే హౌస్‌ సభ్యుడిగా, ప్రజారోగ్య, స్వచ్ఛంద సంస్థల వ్యవస్థకి ఛైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు. ప్రజారోగ్యం, క్లినికల్ రీసెర్చ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెలెక్ట్ కమిటీ, ఎన్‌హెచ్‌ఎస్‌కు చెందిన పలు కమిటీలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ఇలా వైద్య రంగానికి ఎనలేని సేవలు చేసినందుకు గాను కక్కార్‌ను ఆ దేశ రెండవ అత్యున్నత పురస్కారం కేబీఈ దక్కింది.


కక్కార్‌తో పాటు ఆనర్స్ జాబితాలో ఉన్న భారత సంతతి ప్రముఖులు.. శాలినీ ఖేమ్కా, కమలేష్ ఖుంటి, రవి ప్రకాశ్ మహాజన్, ఇక్బాల్ సింగ్, డా. హింద్ పాల్ సింగ్ భుయ్, అల్పేష్ చౌహాన్, డా. జపిందర్ ధేసి, దేవిందర్ సింగ్ ధిల్లాన్, నితిన్ గణత్ర, జగ్తార్ సింగ్ గిల్, శరత్ కుమార్ జీవన్, అమృతపాల్ సింగ్ మాన్ ఉన్నారు. ఇక ఈ ఏడాది విడుదల చేసిన ఆనర్స్ జాబితాలో ఏకంగా 618 మంది మహిళలు ఉండడం విశేషం. అలాగే 78 మంది ఒలింపియన్స్, పారాలింపియన్లు ఉన్నారు. బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ పేరిట ప్రధానం చేసే ఈ వార్షిక అవార్డుల కమిటీకి దేశ ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు. 

Updated Date - 2022-01-02T16:08:45+05:30 IST