
బ్రిటీష్ వ్యక్తి వినూత్న గాథ
కైవ్: రష్యా సైనిక దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలే కాదు జంతువులను కూడా తీసుకొని పొరుగు దేశాలకు వలస పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉక్రెయిన్ దేశంలోని జూ పార్కులో చిక్కుకుపోయిన తన పెంపుడు జంతువులు సింహం, తోడేలును తీసుకొని 2వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన బ్రిటీష్ వ్యక్తి గాథ ప్రజలను ఆశ్చర్యపర్చింది. తాను ప్రాణపదంగా పెంచుకున్న జంతువుల ప్రాణాలు కాపాడేందుకు బ్రిటీషుకు చెందిన టిమ్ లాక్స్ అనే వ్యక్తి 2వేల మీటర్లదూరం ప్రయాణించారు. తనకిష్టమైన జంతువులతో కలిసి ప్రయాణించిన టిమ్ లాక్స్ తన ప్రయాణాన్ని ఫేస్బుక్లో డాక్యమెంట్ చేశారు.
యుద్ధం వల్ల మూసివేసిన ఉక్రేనియన్ జంతుప్రదర్శనశాల నుంచి ఒక సింహం, తోడేలును ఫోర్డ్ ట్రాన్సిట్ మినీబస్సులో క్రేన్, జేసీబీల సాయంతో లోడ్ చేయించారు. రెండు జంతువులను లోడ్ చేయడానికి 3 గంటల సమయం పట్టింది. ఎయిర్ రైడ్ సైరన్ లు మోగిస్తూ పోలీసు ఎస్కార్టుతో తమ ప్రయాణం సాగిందని టిమ్ చెప్పారు. ఉక్రెయిన్ దేశం నుంచి 2వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి జంతువులను రొమేనియా జూకు చేర్చారు. రొమేనియా జూలో సింహం, తోడేలు క్షేమంగా ఉన్నాయని టిమ్ లాక్స్ ఫేస్బుక్లో పోస్టు చేశారు. టిమ్ ఫేస్ బుక్ పోస్టుకు నెటిజన్ల నుంచి లైక్ లు, షేర్ లు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి