Queen Elizabeth’s wealth: క్వీన్ ఎలిజబెత్-2 ఆస్తుల విలువ ఎంత? ఆమె ఆదాయ వనరులు ఏమిటి?

ABN , First Publish Date - 2022-09-09T23:02:03+05:30 IST

బ్రిటన్ రాజ్యవంశ చరిత్రలో ఓ సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-2) గురువారం కన్నుమూశారు.

Queen Elizabeth’s wealth: క్వీన్ ఎలిజబెత్-2  ఆస్తుల విలువ ఎంత? ఆమె ఆదాయ వనరులు ఏమిటి?

బ్రిటన్ రాజ్యవంశ చరిత్రలో ఓ సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth-2) గురువారం కన్నుమూశారు. దీంతో ఆమె గురించి, ఆమె ఆస్తుల గురించి, వారసత్వం గురించి పలు ఆసక్తికరమైన అంశాలు చర్చలోకి వస్తున్నాయి. సెలబ్రిటీ నెట్ వర్త్ ప్రకారం, క్వీన్ ఎలిజబెత్-2 నికర ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5000 కోట్లు). బ్రిటీష్ ప్రభుత్వం రాజకుటుంబానికి ప్రతి ఏడాది సావరిన్ గ్రాంట్ ఇస్తుంది. ఈ గ్రాంట్‌ నుంచి వచ్చే డబ్బులో కొంత భాగాన్ని ఎలిజబెత్-2 ప్రయాణం, ఆస్తి నిర్వహణ, క్వీన్స్ గృహ నిర్వహణ ఖర్చుల కోసం కేటాయిస్తారు. మిగిలిన దానిని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఖర్చుల కోసం కేటాయిస్తారు.


ఇది కూడా చదవండి..

నాకు అమ్మాయిలంటేనే ఇష్టం.. చెప్పుకోవడానికి నేనేమీ సిగ్గు పడటం లేదు.. అవమానాలను ఎదుర్కొని నిలిచిన యువతి కథ ఇదీ..!


ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం బ్రిటన్‌ రాజ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 88 బిలియన్ (Queen Elizabeth’s wealth) డాలర్లు. అయితే అందులో క్వీన్‌ ఎలిజబెత్‌ 2 వ్యక్తిగత ఆస్తుల విలువ 600 మిలియన్‌ డాలర్లు. అవి ఆమె కుటుంబానికి చెందుతాయి. ఇక, రాజకుటుంబం కింద ఉన్న ఆస్తులను విక్రయిండానికి లేదు. క్వీన్ ఎలిజబెత్-2  ఆదాయంలో ఎక్కువ భాగం క్రౌన్ ఎస్టేట్‌ నుంచి వచ్చింది. క్రౌన్ ఎస్టేట్ అనేది బ్రిటీష్ రాజవంశానికి చెందిన భూములు, హోల్డింగ్‌ల సమాహారం. ఇది ఎలిజబెత్-2 స్వంత ఆస్తి కాదు. దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ ఎస్టేట్‌కు వచ్చే లాభాల్లో 15 శాతం క్వీన్ పొందుతారు. ఇక, క్వీన్ ఎలిజిబెత్‌కు లాంకాస్టర్‌లోని ఉన్న ప్రైవేట్ ఆస్తి నుంచి కూడా సంపద వస్తుంది. 


ఇది 18,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2020లో దీని విలువ సుమారు 23 మిలియన్ పౌండ్లు. డచీ ఆఫ్ కార్న్‌వాల్ కూడా వీరి ఆధీనంలోనే ఉంది. ఇవి మాత్రమే కాకుండా బ్రిటిష్ రాజకుటుంబాలకు 23 ఇంగ్లీష్ కౌంటీలలో భూములు ఉన్నాయి. ఇక, క్వీన్ మరో అతిపెద్ద ఆదాయ వనరు ది రాయల్ కలెక్షన్ ట్రస్ట్ నుంచి వస్తుంది. దీని నిర్వహణ కింద అనేక మ్యూజియాలు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులు ఉన్నాయి. ఇక, కోహినూర్ వజ్రం సహా అనేక విలువైన సేకరణలు బ్రిటన్ రాజకుటుంబం సొంతం. కాగా, ఎలిజబెత్-2 మరణించడంతో కింగ్ చార్లెస్(King Charles) సింహాసనాన్ని అధిష్టించనున్నారు. అంతేకాదు ఆమె వ్యక్తిగత సంపదను కూడా పొందుతారు. 

Updated Date - 2022-09-09T23:02:03+05:30 IST