$61 బిలియన్ల భారీ డీల్... VMwareను బ్రాడ్‌కామ్ కొనుగోలు

Published: Fri, 27 May 2022 17:20:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
$61 బిలియన్ల భారీ డీల్...  VMwareను బ్రాడ్‌కామ్ కొనుగోలు

హైదరాబాద్ : బ్రాడ్‌కామ్ అతిపెద్ద టెక్ డీల్‌లో భాగంగా... $61 బిలియన్లకు ను కొనుగోలు చేసింది. బ్రాడ్‌కామ్ ఇంక్. క్లౌడ్-కంప్యూటింగ్ కంపెనీ VMware Inc.ను దాదాపు $61 బిలియన్ల నగదు, స్టాక్‌తో కొనుగోలు చేయడానికి అంగీకరించింది. VMware షేర్‌హోల్డర్‌లు ప్రతి VMware షేర్‌కు $142.50 నగదు, లేదా...  0.2520 బ్రాడ్‌కామ్ సాధారణ స్టాక్‌లను స్వీకరించడానికి అవకాశముంటుంది. బ్రాడ్‌కామ్ VMware సంబంధిత నికర రుణంలో $8 బిలియన్లను కూడా స్వీకరించనుంది.


ఈ డీల్‌లో భాగంగా... రెండు రోజుల క్రితం(బుధవారం) కామన్ స్టాక్ ముగింపు ధర ఆధారంగా $61 బిలియన్ల విలువైన నగదు/స్టాక్ లావాదేవీలో బ్రాడ్‌కామ్ VMwareను కొనుగోలు చేయనున్నట్లు బ్రాడ్‌కామ్ ప్రకటించింది. Mware కూడా ఈ ప్రకటనేను ధృవీకరించింది. కాగా... ఈ డీల్ నేపథ్యంలో బ్రాడ్‌కామ్ స్టాక్ నిన్న(గురువారం) 3.5 %, VMware షేర్లు 3. 1% పెరిగాయి. బ్రాడ్‌కామ్ గతంలో(2018 లో) CA టెక్నాలజీస్‌ను $18.9 బిలియన్లకు, సిమాంటెక్‌ను 2019 లో $10.7 బిలియన్లకు కొనుగోలు చేసింది. VMware గత సంవత్సరం చివరలో రుణాన్ని చెల్లించే ప్రయత్నంలో డెల్ నుండి విడిపోయింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.