
తిరుమల: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణగిరి అతిథి గృహాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. మూడు గదులు ధ్వంసం అయ్యాయి. ప్రమాద సమయంలో గదులలో భక్తులు ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. నారాయణగిరి, ఎస్వీ గెస్ట్స్లో ఉన్న భక్తులను ఇతర ప్రాంతాలకు టీటీడీ అధికారులు తరలించారు.అలాగే తిరుమల రెండో ఘాట్ రోడ్లో 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలను జేసీబీలతో టీటీడీ సిబ్బంది తొలగిస్తున్నారు.