Brooklyn Subway షూటర్‌ను పట్టిచ్చిన హీరో జాక్ దహ్హాన్

ABN , First Publish Date - 2022-04-14T13:22:12+05:30 IST

బ్రూక్లిన్ సబ్‌వే మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రజలను, పోలీసులను అప్రమత్తం చేసి నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన యువకుడికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి...

Brooklyn Subway షూటర్‌ను పట్టిచ్చిన హీరో జాక్ దహ్హాన్

న్యూయార్క్(అమెరికా): బ్రూక్లిన్ సబ్‌వే మెట్రో రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ప్రజలను, పోలీసులను అప్రమత్తం చేసి నిందితుడిని అరెస్టు చేయడంలో సహకరించిన యువకుడికి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.జాక్ దహ్హాన్ అనే 21 ఏళ్ల సెక్యూరిటీ కెమెరా ఇన్‌స్టాలర్ షూటర్ జేమ్స్‌ను పోలీసులకు పట్టిచ్చాడు. బ్రూక్లిన్ సబ్‌వే షూటింగ్ కేసులో నిందితుడు ఫ్రాంక్ రాబర్ట్ జేమ్స్ అరెస్టయిన తర్వాత ఆచూకీ చెప్పిన జాక్ హీరోగా అవతరించాడు.షూటర్‌ జేమ్స్‌ను గుర్తించిన మొదటి వ్యక్తి దహ్హాన్.‘‘నేను స్టోర్ కెమెరాలలో మెయింటెనెన్స్ చేస్తుండగా జేమ్స్ బిజీగా ఉన్న ఈస్ట్ విలేజ్ పరిసరాల్లో తన భుజంపై బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తున్నాడు.దీంతో నేను న్యూయార్క్ పోలీసులను అప్రమత్తం చేశాను, దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు’’అని జాక్ చెప్పారు.


తాను మధ్యప్రాచ్య దేశం యొక్క భయంకరమైన అంతర్యుద్ధం సమయంలో తాను సిరియాలో పెరిగానని, ఇప్పుడు న్యూజెర్సీలోని యూనియన్ సిటీలో నివసిస్తున్నానని దహన్ చెప్పాడు. పోలీసులు, న్యూయార్క్ ప్రజలు షూటర్ పట్టిచ్చిన జాక్ ను హీరోగా వర్ణిస్తూ అభినందనల వర్షం కురిపించారు.


Updated Date - 2022-04-14T13:22:12+05:30 IST