చెల్లి చనిపోయిందని ఫోన్‌కాల్.. 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం.. సోదరి చితిమంటలపైనే దూకేసిన అన్న..!

ABN , First Publish Date - 2022-06-13T17:46:12+05:30 IST

ఆ యువతి గురువారం సాయంత్రం 6 గంటలకు పొలానికి వెళ్లి ఎంత సేపటికీ తిరిగి రాలేదు..

చెల్లి చనిపోయిందని ఫోన్‌కాల్.. 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం.. సోదరి చితిమంటలపైనే దూకేసిన అన్న..!

ఆ యువతి గురువారం సాయంత్రం 6 గంటలకు పొలానికి వెళ్లి ఎంత సేపటికీ తిరిగి రాలేదు.. ఆమె గురించి రాత్రి 12 గంటల వరకు వెతికినా ఆచూకీ లభించలేదు.. చివరకు తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు పొలంలోని బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది.. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.. విషయం తెలుసుకున్న సోదరుడు తన ఉంటున్న ఊరి నుంచి 430 కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించాడు.. సరాసరి స్మశానికి వెళ్లి సోదరి చితిమంటలపైనే దూకేశాడు.. హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మరణించాడు. 


ఇది కూడా చదవండి..

ఏడాది క్రితం చనిపోయిన 82 ఏళ్ల బామ్మ మళ్లీ పుట్టింది.. కారణమేంటంటే..


మధ్యప్రదేశ్‌లోని సాగర్ సమీపంలోని మజ్‌గువాన్ గ్రామానికి చెందిన జ్యోతి అనే యువతి గురువారం సాయంత్రం 6 గంటలకు పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తూ బావిలో పడి మరణించింది. ఆమె గురించి కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. చివరకు తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు పొలంలోని బావిలో ఆమె మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అనంతరం జ్యోతి మృతదేహానికి కుటుంబ సభ్యులు శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. జ్యోతి సోదరుడు కరణ్‌ ఠాకూర్‌‌కు విషయం తెలియడంతో అతను బైక్‌పై 430 కిలోమీటర్లు ప్రయాణించి మజ్‌గువాన్ గ్రామానికి చేరుకున్నాడు. 


సరాసరి స్మశానానికి వెళ్లాడు. అప్పటికే జ్యోతి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కరణ్ నేరుగా వెళ్లి జ్యోతి చితిమంటలపైకి దూకేశాడు. స్థానికులు చూసేసరికి అతని శరీరం చాలా వరకు కాలిపోయింది. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే కరణ్ మరణించాడు. పోలీసులు కరణ్ మృతదేహానికి కూడా పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఆదివారం ఉదయం కరణ్ మృతదేహానికి కూడా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2022-06-13T17:46:12+05:30 IST