పనితీరు పదవిని తెచ్చేనా?

ABN , First Publish Date - 2020-10-05T10:21:09+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలి తాలు ఉమ్మడి జిల్లాలోని అధికార టీఆర్‌

పనితీరు పదవిని తెచ్చేనా?

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు

భవిష్యత్తులో పదవుల మీద ఆశతో తమ నియోజకవర్గాల్లో ఎవరికి వారే ప్రయత్నాలు

పార్టీ ఓటర్లను క్యాంపులకు తరలించిన శాసనసభ్యులు

అప్రమత్తమైన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు


నిజామాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలి తాలు ఉమ్మడి జిల్లాలోని అధికార టీఆర్‌ ఎస్‌ ప్రజాప్రతినిధులు, నేతల పనితీరు కు అద్దం పట్టనున్నాయి. భవిష్యత్తులో వారికి పదవులను తెచ్చిపెట్టనున్నా యి. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్ర జాప్రతినిధులు ఈ ఉపఎన్నికపై దృష్టిపెట్టారు. తమ నియోజక వర్గాలు, మండలాల పరిధిలో ని ఓట్లు చీలకుండా ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చే స్తున్నారు. తమ పార్టీ ఓట ర్లను క్యాంపులకు తరలిం చిన వారు ఇతర ఓటర్ల తో మంతనాలు జరు పుతున్నారు. తమ పా ర్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతు న్నారు. ఉమ్మడి జి ల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఈ నెల 9న జరగనుంది. ఈ ఉప ఎన్నికకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. సమయం దగ్గరప డడంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని మంత్రితో సహా ఇతర ఎ మ్మెల్యేలు తమ నియోజకవర్గం పరిధిలోని పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను క్యాంపులకు తరలిం చారు. హైదరాబాద్‌ శివారులోని రిసార్టులో ఉంచారు. మిగ తా ఓటర్లపై దృష్టి పెట్టారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ముందుగానే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలకు దిశానిర్దేశం చేయడంతో ఎవరికి వారే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గం బాధ్యతల ను ఎమ్మెల్యేలకు అప్పజెప్పడంతో అన్ని తామై వ్యవహరిస్తు న్నారు. ఒక్క ఓటు కూడా చీలకుండా ఏర్పాట్లను చేశారు. ఎ వరైనా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అసంతృప్తితో ఉం టే వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప రిధిలో అధిక ఓట్లు పడే విధంగా పనిచేస్తున్నారు. గత పార్లమెంట్‌ లో జరిగిన అంశాలను దృష్టిలో పెట్టుకుని అప్రమత్తం అయి ఈ చర్యలను చేపట్టారు.


ఉమ్మడి జిల్లా పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాలలో ఎ మ్మెల్సీ ఉప ఎన్నికలో పడే ఓట్టే కీలకం కావడంతో ఎమ్మెల్యే లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ అనుచరులతో క్యాం పు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలో వచ్చే ఓట్లే భ విష్యత్తులో భర్తీ చేసే నామినేటెడ్‌ పదవులకు కీలకం కానుం డడంతో ఎవరికి వారే తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో కార్పొరేషన్‌ పదవులతో పాటు ఇతర పదవుల ను భర్తీచేసే అవకాశం ఉండడంతో తమ వంతు ప్రయత్నా లు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నేతలు చేస్తున్నారు. జిల్లా మంత్రి ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నారు. ఇతర పా ర్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికార పార్టీ నేతలు అంతా క్యాంపులో బిజీ అ య్యారు. కింది స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఎమ్మె ల్యేలు చెప్పిన బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈనెల 9న జరిగే పోలింగ్‌ కోసం సమాయత్తం అవుతున్నారు.


 టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 650కి పైగా ఓట్లే లక్ష్యం

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు 650కి పైగా ఓట్లే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగి ంచుకోనుండగా భారీ ఆధిక్యం వచ్చే విధంగా తొమ్మిది నియో జకవర్గాలలో ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. వీరికి ఎంపీలు, ఎ మ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. సమ యం తక్కువగా ఉండడంతో పూర్తి స్థాయిలో నజర్‌ పెట్టి ప నిచేస్తున్నారు. విపక్షాల నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుం డా ఎమ్మెల్యేలు తమ పావులను కదుపుతున్నారు. 


ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌, బీజేపీ నేతల ప్రయత్నాలు

ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమ ఓట్లు చీలకుండా కాం గ్రెస్‌, బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అభ్యర్థు లు కాంగ్రెస్‌ తరపున సుభాష్‌రెడ్డి, బీజేపీ తరఫున పి.లక్ష్మీనా రాయణ పోటీలో ఉన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాక ము ందు నుంచే అధికార పార్టీ నేతలు ఇరు పార్టీలకు చెందిన కొంత మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేట ర్లతో మంతనాలు జరిపారు. కొద్ది మందిని చేర్చుకున్నారు. దీ నితో అప్రమత్తం అయినా బీజేపీ నేతలు నష్ట నివారణ చర్య లు చేపట్టారు. జిల్లా ఎంపీ, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షులు, నేతలు అప్రమత్తం అయ్యారు. తమ పార్టీ ప్రజాప్రతినిధుల ను క్యాంపులకు తరలించారు. ఇక ఎవరూ పోకుండా ఏర్పాట్ల ను చేసుకున్నారు. తమ అభ్యర్థికి తమ పార్టీ ప్రజాప్రతినిధు ల ఓట్లు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి కా వాల్సిన హామీలను ఇస్తున్నారు. ఇప్పటి వరకు క్యాంపు చేప ట్టని కాంగ్రెస్‌ నేతలు తమ ప్రజాప్రతినిధులతో చర్చలు జరు పుతున్నారు. ఇప్పటికే కొంత మంది పార్టీని విడిచి వెళ్లగా మి గతా వారిని బుజ్జగిస్తున్నారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వా లని కోరుతున్నారు. సీనియర్‌ నేతలు పార్టీలో ఉన్న పూర్తి స్థా యి సమన్వయం లేకపోవడం వల్ల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ ఎస్‌లోకి కొద్ది మంది ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జ డ్పీటీసీలు చేరారు. దీంతో ఉన్న ఓటర్ల మద్దతును కాంగ్రెస్‌ నేతలు కూడగడుతున్నారు. అధికార పార్టీకి కొద్దిగానైనా కట ్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలలో మూడు పార్టీల అభ్యర్థులకు ఎన్ని ఓట్లు రానున్నాయో ఈ నెల 12న కౌంటింగ్‌లో తేలనుంది. 

Updated Date - 2020-10-05T10:21:09+05:30 IST