అర్ధరాత్రి రికార్డుల అప్‌లోడ్‌

Sep 18 2021 @ 00:12AM
ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో హౌసింగ్‌ రికార్డులు ఆనలైన చేస్తున్న సిబ్బంది

ఆనలైన కోసం మోరాయిస్తున్న సర్వర్లు

మహిళలు, పిల్లల తల్లులకూ తప్పని అవస్థలు 

110 మంది ఉంటే 60 మందికే భోజనాలు

హౌసింగ్‌ సిబ్బంది తిప్పలు

కడప, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): హౌసింగ్‌ శాఖలో ఎన్టీఆర్‌ హయాం నుంచి హౌసింగ్‌ బకాయిలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో 15-20 వేలు, వనటైం సెటిల్‌మెంటు కింద చెల్లిస్తే ఇంటిని రిజిసే్ట్రషన చేయిస్తామని జగన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హౌసింగ్‌ సిబ్బందికి కష్టాలు తెచ్చి పెట్టింది. గురువారం మంత్రివర్గ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకోగా శుక్రవారం నుంచే 1983 నుంచి 2013 వరకు ఉన్న హౌసింగ్‌ లబ్ధిదారుల రికార్డులను ఆనలైనలో అప్‌లోడ్‌ చేసేందుకు శ్రీకారం చుట్టారు. పగలంతా సర్వర్‌ సమస్య కారణంగా రాత్రి కడప నగరంలోని ఎస్వీ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలలో హౌసింగ్‌ రికార్డుల అప్‌లోడ్‌ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా కనీస సౌకర్యాలు లేకపోవడం, రాత్రంతా మహిళలు, పిల్లల తల్లులు పనిచేయాల్సి రావడంతో హౌసింగ్‌ సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.


3,24,469 మందివి అప్‌లోడ్‌ చేయాలి..

జిల్లాలో 1983 నుంచి 2005 వరకు వివిధ పథకాల కింద 1,68,249 మంది లబ్ధిదారులు, 2006 నుంచి 2013 వరకు 2,05,332 మంది లబ్ధిదారులు కలిపి 3,73,581 మంది లబ్ధిదారులు ఆయా పథకాల కింద పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. వీరంతా వనటైం సెటిల్‌మెంటు కింద నిర్ణయించిన మొత్తం చెల్లిస్తే ప్రభుత్వం రిజిసే్ట్రషన చేయిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే కడప జిల్లా నుంచే రూ.375 నుంచి రూ.400 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం 49,112 మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఆనలైనలో నమోదు చేశారు. మిగిలిన 3,24,469 మంది లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. 


పిల్లల తల్లులకూ మినహాయింపు లేదు..

సర్వర్‌ సమస్య కారణంగా నిద్రాహారాలు మాని రాత్రంతా కంప్యూటర్‌ మీద కూర్చోవాల్సి రావడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. పై అధికారులంతా ఇళ్లకు వెళ్లిపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వర్క్‌ ఇనస్పెక్టర్లు మాత్రమే ఆనలైనలో నమోదు చేస్తున్నారు. కనీసం మహిళలు, పిల్లల తల్లులకు రాత్రి విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.


మాడిన అన్నం తిని..

అలాగే కనీస భోజన సౌకర్యం కూడా సకాలంలో ఏర్పాటు చేయలేదని ఆందోళన చెందుతున్నారు. రాత్రి 10 గంటలకు భోజనం ఏర్పాటు చేశారని, అది కూడా 110 మంది అక్కడ విధులు నిర్వర్తిస్తుంటే 60 మందికే భోజనాలు తయారు చేశారని, ఇదేమిటని క్యాంటీన సిబ్బందిని ప్రశ్నిస్తే పై అఽధికారులు ఎంతమందికి చెప్పారో అంత మందికి చేశామని జవాబు ఇస్తున్నారు. ఆకలి తీర్చుకునేందుకు మాడిన అన్నం కూడా తినాల్సి వచ్చిందని ఏకరువు పెట్టారు. ఈ విషయాన్ని హౌసింగ్‌ ఇనచార్జ్‌ పీడీ క్రిష్ణయ్య దృష్టికి ఆంధ్రజ్యోతి తీసుకెళ్లగా సర్వర్‌ ప్రాబ్లమ్‌ వల్ల రాత్రంతా ఆనలైనలో అప్‌లోడ్‌ చేస్తున్న మాట నిజమేనన్నారు. రాత్రి పనిచేస్తే పగలు విశ్రాంతి తీసుకునేందుకు అవకాశం ఇస్తామని పేర్కొనడం కొసమెరుపు. భోజనం విషయాన్ని తీసుకెళ్లగా అందరికీ క్యాంటీనలో ఏర్పాటు చేశామని తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.