
నిజామాబాద్: నగరంలో బాలుడిని (7) గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నిజాంసాగర్ కెనాల్లో బాలుడి మృతదేహం తేలింది. ఆటో నగర్‌కు చెందిన మహమ్మద్ ఫయాజ్‌గా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం నాలుగు గంటలకు ఆడుకుంటానని వెళ్లిన ఫయాజ్ మిస్ అయ్యాడు. నేడు కెనాల్లో విగతజీవిగా తేలాడు. నల్లటి తాళ్లతో రెండు చేతులు కట్టేసి, ముఖానికి నల్లటి స్కార్ఫ్ కట్టి కెనాల్లో పడేసినట్లు పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి