వేంపల్లెలో దారుణ హత్య

ABN , First Publish Date - 2022-09-27T05:58:08+05:30 IST

చింతలమడుగుపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి (40), భార్య అమ్మణ్ణి, పిల్లలు కలిసి నివాసముంటున్నారు. ఇతను మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి మహేశ్వర్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో బైక్‌లో బయటకు వెళ్లాడు. ముందే

వేంపల్లెలో దారుణ హత్య
హత్యకు గురైన మహేశ్వర్‌రెడ్డి (ఫైల్‌ఫొటో)

ఆస్తి తగాదాలే కారణం..?

డీఎస్పీ పరిశీలన, కేసు నమోదు 

వేంపల్లె, సెప్టెంబరు 26: వేంపల్లె మండలం చింతలమడుగుపల్లెకు చెందిన ఓ మెకానిక్‌ దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు కసిగా తలపై, ఒంటిపై పొడిచిపొడిచి చంపారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

చింతలమడుగుపల్లెకు చెందిన మహేశ్వర్‌రెడ్డి (40), భార్య అమ్మణ్ణి, పిల్లలు కలిసి నివాసముంటున్నారు. ఇతను మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే ఆదివారం రాత్రి మహేశ్వర్‌రెడ్డి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో ఫోన్‌ రావడంతో  బైక్‌లో బయటకు వెళ్లాడు. ముందే పథకం ప్రకారం దారి కాచిన గుర్తు తెలియని నిందితులు పాతగండి రోడ్డులోని ఈదలబావి వద్ద అటకాయించి మహేశ్వర్‌రెడ్డిపై మారణాయుధాలతో దాడి చేశారు. శరీర భాగాలను, తలను రాళ్లతోను, ఇతర ఆయుధాలతో పొడిచిపొడిచి చంపినట్లు మృతదేహాన్ని బట్టి పరిశీలిస్తే అర్థమవుతోంది. తెల్లావారాక పొలాలవద్దకు పనులకు వెళ్లిన రైతులు ఈదలబావి వద్ద మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ముఖంపై, ఒంటటిపై తీవ్ర గాయాలు ఉండడంతో మొదట మృతుడు ఎవరనేది గుర్తించలేకపోయారు. పరిశీలించిన అనంతరం మహేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు సీతారామిరెడ్డి, బాలమద్దిలేటి, ఎస్‌ఐ తిరుపాల్‌నాయక్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. భార్య అమ్మణ్ణి, ఇతర బంధువులను విచారించారు. ఆస్తి తగాదాలున్నాయని ఈ కారణంగానే హత్య చేసి ఉంటారని భార్య అమ్మణ్ణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఫోన్‌ ఎవరు చేశారు, ఏమని చేశారు అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది.


సీఎం నియోజకవర్గంలో హత్యలు శోచనీయం

ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో హత్యలు చోటుచేసుకోవడం శోచనీయమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారధిరెడ్డి పేర్కొన్నారు. మహేశ్వర్‌రెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకున్న ఆయన హతుడి భార్య, పిల్లలను పరామర్శించారు. అనంతరం వేంపల్లెలో విలేకరులతో మాట్లాడారు. దిద్దెకుంట, కోమన్నూతల, చిన్నకుడాలలో హత్యలు జరిగాయని, పులివెందుల పట్టణ సమీపంలో హిజ్రాపై 11 మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని అన్నారు. ఇలాంటి సంఘటనలతో పులివెందుల  ప్రాంతంలో శాంతిభద్రతలు అసలున్నాయా అని ప్రశ్నించారు.

Updated Date - 2022-09-27T05:58:08+05:30 IST