Break: మాజీ ముఖ్యమంత్రికి అధిష్ఠానం షాక్...

ABN , First Publish Date - 2022-09-09T18:42:22+05:30 IST

యడియూరప్పకు అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. 2023 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 104 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పర్యటించాలని

Break: మాజీ ముఖ్యమంత్రికి అధిష్ఠానం షాక్...

- అప్ప ‘ప్రత్యేక ’ పర్యటనకు అధిష్ఠానం బ్రేక్‌

- సీఎంతో కలిసే పర్యటించాలని సూచన

- హైకోర్టు విచారణ ఆదేశాల నేపథ్యంలోనే మారిన నిర్ణయాలు..!


బెంగళూరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): యడియూరప్పకు అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. 2023 శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 104 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పర్యటించాలని నిర్ణయించిన మాజీ సీఎం, పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్. యడియూరప్ప(B.S. Yeddyurappa)కు అధిష్టానం గురువారం బ్రేక్‌ వేసింది. బీజేిపీ వర్గాల కథనం ప్రకారం ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై(Chief Minister Basavaraja Bommai)తో కలిసే పర్యటించాలని అదేవిధంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళినికుమార్‌ కటిల్‌ సారథ్యంలో బీజేిపీ నేతల బృందం జరిపే పర్యటనల్లోనూ పాల్గొనాలని యడియూరప్పకు సూచించినట్లు తెలుస్తోంది. సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని యడియూరప్ప ప్రకటిస్తూనే ఉన్నారు. ఇందుకు అధిష్టానం వరుసగా బ్రేక్‌లు వే స్తూనే వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు రాష్ట్రంలోని మొత్తం 224 శాసనసభా నియోజకవర్గాల్లోనూ కలిపి మొత్తం మూడు బృందాలు గా అగ్రనేతలు పర్యటించాలని ఇటీవలి కోర్‌కమిటీలో ప్రస్తావన వచ్చింది. ఒక బృందానికి సీఎం బొమ్మై నాయకత్వం వహించాలని మరో బృందానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళినికుమార్‌ కటిలు సారధ్యం వహించాలని మూడో బృందానికి పార్టీ జా తీయ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్‌ యడియూరప్ప నాయకత్వం వహించాలని తొలుత నిర్ణయించారు. చివరి క్షణంలో మూడు బృందాలను రెండుకు కుదిస్తూ అధిష్టానం  సంకేతాలుపంపినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. యడియూరప్ప ఏయే నియోజకవర్గాల్లో పర్యటించాలో నిర్ణయించే అధికారాన్ని పార్టీ రాష్ట్రానికి అప్పగించింది. ఈ లెక్కన పార్టీ రాష్ట్ర నాయకత్వమే యడియూరప్ప(Yeddyurappa) పర్యటన రూపురేఖలను ఖరారు చేయనుంది. ఈ పరిణామాలు  సహజంగానే యడియూరప్పతో పాటు ఆయన శిబిరంలో తీవ్ర నిరాశ కలిగించినట్లు తెలిసింది. యడియూరప్పపై వచ్చి న ఆవినీతి ఆరోపణలపై దర్యాప్తుకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది నిజంకాదని బీజేపీ వర్గాలు  స్పష్టంచేశాయి. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత విషయాల్లో యడియూరప్పను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకోవాలని రాష్ట్ర పార్టీకి అధిష్టానం చెప్పిందని సీనియర్‌ నేతగా ఉన్న అప్ప సేవలను పార్టీ గరిష్టంగా వినియోగించుకుంటుందని ఆయనకు ఇదే సమయంలో పార్టీ వేదికల్లో  సముచిత గౌరవం లభిస్తుందని ఈ వర్గాలు తెలిపాయి. బీజేపీలో ఎటువంటి గ్రూపు రాజకీయాలకు తావు లేదని, అందరమూ కలసికట్టుగా పార్టీని గెలిపిస్తిమన్నారు. కాగా తన ప్రత్యేక పర్యటనకు అధిష్టానం బ్రేక్‌ వేసిన అంశంపై స్పం దించేందుకు యడియూరప్ప నిరాకరించారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను ఒక క్రమశిక్షణ కలిగిన నేతగా శిరసావహిస్తానని 2023 ఎన్నికల్లో పార్టీకి 140కు పైగా స్థానాలు సాధించి పెట్టాలన్నదే తన సంకల్పమని యడియూరప్ప పేర్కొన్నారు.

Updated Date - 2022-09-09T18:42:22+05:30 IST