pakisthan సాయుధ చొరబాటుదారుల యత్నాన్ని అడ్డుకున్న BSF

ABN , First Publish Date - 2022-06-14T13:00:04+05:30 IST

జమ్మూకశ్మీరులోని ఆర్నియా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ సాయుధ చొరబాటుదారుల యత్నాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకుంది...

pakisthan సాయుధ చొరబాటుదారుల యత్నాన్ని అడ్డుకున్న BSF

జమ్మూ: జమ్మూకశ్మీరులోని ఆర్నియా సెక్టారులో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ సాయుధ చొరబాటుదారుల యత్నాన్ని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అడ్డుకుంది. రాత్రి సమయంలో ఆర్నియా సెక్టారులో సరిహద్దుల వద్ద పాక్ సాయుధులు మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు చేసిన యత్నాలను చూసిన బీఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమై కాల్పులు జరిపాయి. సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో పాక్ సాయుధులు పారిపోయారు. అమరనాథ్ యాత్ర నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పహరాను ముమ్మరం చేశారు. సరిహద్దుల్లో అనుమానాస్పద కదలికలపై కేంద్ర నిఘా సంస్థ భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి కాల్పులు జరిపి పాక్ సాయుధ చొరబాటుదారులను తిప్పి కొట్టారు. రెండేళ్ల కరోనా వైరస్ మహమ్మారి తర్వాత జూన్ 30వతేదీన అమరనాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీరులో భద్రతను కట్టుదిట్టం చేశారు. 


Updated Date - 2022-06-14T13:00:04+05:30 IST