తప్పిపోయిన మూడేళ్ళ Pakistani బాలుడు... కుటుంబానికి అప్పగించిన BSF...

ABN , First Publish Date - 2022-07-02T17:40:35+05:30 IST

భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల సమీపానికి

తప్పిపోయిన మూడేళ్ళ Pakistani బాలుడు... కుటుంబానికి అప్పగించిన BSF...

చండీగఢ్ : భారత్-పాక్ సరిహద్దుల్లోని పంజాబ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల సమీపానికి అనుకోకుండా వచ్చిన ఓ మూడేళ్ళ బాలుడు తిరిగి తల్లిదండ్రులను చేరుకున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆ బాలుడిని గుర్తించిన సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు పాకిస్థాన్ రేంజర్ల సహకారంతో ఆ బాలుడిని తల్లి ఒడికి చేర్చారు. 


బీఎస్ఎఫ్ (BSF) అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు ఫిరోజ్‌పూర్ సెక్టర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్దకు ఓ మూడేళ్ళ బాలుడు వచ్చాడు. ఆ బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తుండటాన్ని, తన తండ్రిని పిలుస్తుండటాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గమనించారు. దీంతో బీఎస్ఎఫ్ ఫీల్డ్ కమాండర్ పాకిస్థానీ రేంజర్స్‌ (Pakistani Rangers)తో తక్షణమే ఫ్లాగ్ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. రేంజర్స్ సమావేశమైన తర్వాత ఆ బాలుడిని తన తండ్రి సమక్షంలో రేంజర్స్‌కు అప్పగించారు. 


Updated Date - 2022-07-02T17:40:35+05:30 IST