ఫుడ్ ఫారెస్ట్‌గా మారిన బంజరు భూమి.. 50 మందికి ఉపాధి.. వివరాలివే!

Published: Mon, 28 Mar 2022 12:23:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫుడ్ ఫారెస్ట్‌గా మారిన బంజరు భూమి.. 50 మందికి ఉపాధి.. వివరాలివే!

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాకు చెందిన జగత్ సింగ్ 1980లో బీఎస్ఎఫ్ నుండి పదవీ విరమణ చేశారు. తిరిగి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. అయినా వెళ్లలేదు. గ్రామంలోనే ఉంటూ తన బంజరు భూమిని సస్యశ్యామలం చేయాలనే ప్రయత్నం ప్రారంభించాడు. వివిధ రకాల చెట్లను నాటాడు. ఇప్పుడు తన మూడు హెక్టార్ల భూమిని ఫుడ్ ఫారెస్ట్‌గా మార్చాడు. ఇందులో 70 రకాల మొక్కలు 5 లక్షలకు పైగా ఉన్నాయి. దీంతో ఏటా అతనికి లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. దీనితోపాటు 50 మందికి పైగా ఉపాధి కల్పించాడు. ఈ నేపధ్యంలో ఆయనను ఉత్తరాఖండ్ ప్రభుత్వం గ్రీన్ అంబాసిడర్‌గా నియమించింది. 1967లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, జగత్ సింగ్  బీఎస్ఎఫ్‌లో చేరారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అది 1974వ సంవత్సరం. నేను సెలవులో మా గ్రామానికి వచ్చాను. ఇక్కడి నుంచి వచ్చిన వారు ఉద్యోగాలు వెతుక్కుంటూ వేరేప్రాంతాలలో తిరుగుతుండడం చూశాను. ఇక్కడివారు కొండ ప్రాంతాలు, నీటి కొరత కారణంగా వ్యవసాయానికి దూరమవుతున్నారు. ఆడవాళ్లకు కట్టెలకు కలప కూడా దొరకని సమస్య ఎదుయ్యింది. 

నాకు 1.5 హెక్టార్ల భూమి ఉంది. ఈ భూమి బంజరుగా ఉంది. అందులో చెట్లు, మొక్కలు నాటితే.. కనీసం కలప కోసమైనా ఊరి ఆడవాళ్లకు అక్కడక్కడా కనిపించే పరిస్థితి ఉండదని భావించాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మొక్కలు నాటడం మొదలుపెట్టాను. అయితే నీటి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం నీరు కూడా నిలువవుండదు. అయినా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను సెలవులకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క నాటిన తర్వాత తిరిగి వెళ్లేవాడినని తెలిపారు. జగత్ సింగ్ 1980లో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఓ కంపెనీలో జాబ్‌ వచ్చినా దానిలో చేరలేదు. ఫుడ్ ఫారెస్ట్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. తన రిటైర్‌మెంట్‌లో వచ్చిన మొత్తంలో ఎక్కువ మొత్తాన్ని కూడా ఈ పనులకు వెచ్చించాడు. మొట్టమొదట చిన్న చిన్న డ్యామ్‌లను కొంత మంది యువకులతో సాయంతో నిర్మించడం ప్రారంభించారు. తద్వారా నీరు నిల్వ ఉంటుందని భావించారు. గ్రామస్తుల సాయం, తన కృషితో మూడు హెక్టార్ల బంజరు భూమిని అడవిగా మార్చారు. అందులో ప్రస్తుతం 70కి పైగా రకాల మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు అతని 29 ఏళ్ల కుమారుడు రాఘవేంద్ర కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం వహిస్తున్నాడు.  రైతులకు, 40 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. ఈ మహిళలు అడవి చెక్కతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. కొందరు వెదురు బుట్టలు, మరి కొందరు టీ ట్రేలు, చాపలు తయారు చేస్తారు. దీనివల్ల వారికి ఆదాయమార్గం ఏర్పడింది. అంతే కాదు ఈ అడవిని చూసేందుకు విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. జగత్ సింగ్‌ను ప్రజలు జంగ్లీ బాబా అని పిలుచుకుంటారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.