BSF Officer Dead : ఆత్మహత్యకు పాల్పడ్డ బీఎస్ఎఫ్ అధికారి..

ABN , First Publish Date - 2022-07-25T16:47:25+05:30 IST

ఇండియా - పాకిస్తాన్ (India - Pakistan) అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చెక్ పోస్టు వద్ద రామ్‌దేవ్ సింగ్ అనే బీఎస్ఎఫ్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

BSF Officer Dead : ఆత్మహత్యకు పాల్పడ్డ బీఎస్ఎఫ్ అధికారి..

జమ్మూ : ఇండియా - పాకిస్తాన్ (India - Pakistan) అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చెక్ పోస్టు వద్ద రామ్‌దేవ్ సింగ్ అనే బీఎస్ఎఫ్(BSF) అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఉపయోగించే ఆయుధంతో కాల్చుకుని చనిపోయారని అధికారులు ప్రకటించారు. మృతదేహం పక్కనే ఆయుధాన్ని గుర్తించామని తెలిపారు. సోమవారం ఉదయం 6.35 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఇతడు 12వ బెటాలియన్‌కు చెందిన అధికారి అని, బీఎస్ఎఫ్‌కు చెందిన ఒక ప్లాటూన్‌ను కమాండింగ్ చేస్తున్నారని అధికారులు చెప్పారు. పోలీస్, బీఎస్ఎఫ్ కోర్టు దర్యాప్తు జరుగుతుందని, ఆత్మహత్యకు గల కారణాలు తేల్చుతామని వివరించారు.

Updated Date - 2022-07-25T16:47:25+05:30 IST