Pakistan: డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు

ABN , First Publish Date - 2022-07-23T18:39:35+05:30 IST

జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్(BSF troops) పాక్ డ్రోన్‌పై(Pakistani drone) కాల్పులు(open fire) జరిపింది....

Pakistan: డ్రోన్‌పై బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులు

శ్రీనగర్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్(BSF troops) పాక్ డ్రోన్‌పై(Pakistani drone) కాల్పులు(open fire) జరిపింది. శుక్రవారం అర్థరాత్రి జమ్మూ జిల్లాలోని కనాచక్ ప్రాంతంలో ఇండో-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానిత పాకిస్థాన్ డ్రోన్‌పై తమ సైనికులు కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) తెలిపింది.శుక్రవారం రాత్రి బీఎస్ఎఫ్ (BSF) జవాన్లు కనచక్ ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్‌ను గమనించాయి. అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు దానిపై కాల్పులు జరిపాయి. పాక్(pak) సరిహద్దు ప్రాంతంలో గాలిస్తున్నామని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.


పాక్ ఆర్మీ(Pak Army),ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) డ్రోన్‌ల ద్వారా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదు, మాదకద్రవ్యాలను వదులుతున్నాయి.జులై 16న పూంచ్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి కనిపించిన పాక్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపింది. కృష్ణా ఘాటి సెక్టార్‌లోని బలోని సమీపంలో నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్ ఎగురుతున్నట్లు కనిపించింది.జులై 18న జమ్మూ కాశ్మీర్ పోలీసులు జమ్మూ అంతటా మూడు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) మాడ్యూళ్లను ఛేదించారు. గత ఏడాది జూన్ 27న జమ్మూలోని హై సెక్యూరిటీ ఐఏఎఫ్ స్టేషన్‌పై పాక్ డ్రోన్‌లు పేలుడు పదార్థాలను పడవేయడంతో ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) సిబ్బంది గాయపడ్డారు.




Updated Date - 2022-07-23T18:39:35+05:30 IST